Asianet News TeluguAsianet News Telugu

5వేల రూపాయల కోసం ఇల్లిల్లు తిరిగా,కంటతడి పెట్టిన దిల్ రాజు

  • 2017లో డబుల్ హ్యాట్రిక్ హిట్స్ సాధించిన దిల్ రాజు
  • 6 సినిమాల టీమ్స్ తో సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించిన దిల్ రాజు
  • తన జర్నీని గుర్తు చేసుకుంటూ కంటతడిపెట్టిన దిల్ రాజు
dil raju emotional speech at double hat trick success celebrations

2017లో వరుసగా ఆరు విజయాలు అందుకున్న నిర్మాత దిల్ రాజు సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకులో ఆరు సినిమాల్లో నటించిన నటీనటులతో పాటు సినీ పరిశ్రమ నుండి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా దిల్ రాజు చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. కంటతడి పెట్టుకున్నారు.

 

1987 డిసెంబ‌ర్‌లో నా సినీ జీవితం మొద‌లైంది. మొదటి సారి ఒక సూట్‌ కేస్ ప‌ట్టుకుని బ‌య‌లుదేరారు. 1987, 1997, ఇప్పుడు 2017.. అన్నిటికి ఏదో ఇంట‌ర్‌లింక్ ఉన్న‌ట్టు అనిపిస్తోంది. 1987లో ఆటోమొబైల్ ఫీల్డులో మొదలైన మేమంతా అసోసియేట్ అవ్వడం, సినిమాల మీద ఇంట్రెస్టుతో ఇండ‌స్ట్రీలోకి రావ‌డం, బిగినింగ్‌లో ఫెయిల్యూర్స్ అందరికీ తెలిసిందే. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇదే రోజు మా జీవితంలో గ్రేట్ డే. ఇదే క్రిస్మస్ రోజున పెళ్లిపందిరి సినిమాతో తొలి విజయం అందుకున్నాం. ఆ రోజు ఆ సక్సెస్ లేకుంటే ఈ రోజు ఈ ఆరు సక్సెస్‌లు నా లైఫ్ లో ఉండేవి కావు. ఆ సినిమా కొన్న‌ప్ప‌టి నుంచి రిలీజ్ వ‌ర‌కు ఎంత క‌ష్ట‌ప‌డ్డామో మాకు, మా ఫ్యామిలీస్‌ కి తప్ప చాలా మందికి తెలియదు. ఆ రోజుల్లో 5వేల రూపాయల కోసం రూ.3ల‌క్ష‌లు త‌క్కువ పడితే.. షాప్‌ షాపుకు తిరిగి కలెక్ట్ చేసి క‌ట్టిన రోజు మాకు ఇంకా గుర్తు ఉంది.

 

డిసెంబర్ 25 అందుకే మా లైఫ్ లో స్పెషల్. మాకు పెళ్లి పందిరి సినిమానిచ్చిన కోడి రామకృష్ణ గారిని, జగపతి బాబుగారి, ఆ సినిమాకు పని చేసిన ఇతరులను పిలిచి అందుకే సన్మానం చేయడం. ఆ సినిమా లేకుంటే మేం లేం. ఆ సినిమా ద్వారానే ఇక్క‌డి వ‌ర‌కు రాగ‌లిగాం అని దిల్ రాజు తెలిపారు.

 

ఆ త‌ర్వాత డిస్ట్రిబ్యూష‌న్ ఆఫీస్ పెట్టాక చాలా మంది నిర్మాత‌లు మంచి సినిమాలు ఇచ్చారు. రత్నంగారు, ఎన్వీ ప్రసాద్ గారు, జివిజి రాజుగారు ఇలా పలువురు నిర్మాతలు మాకు మంచి సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం ఇచ్చారు. ఎన్నో సినిమాల‌తో డిస్ట్రిబ్యూషన్ అనుభ‌వం ఉన్న మేం ప్రొడ‌క్ష‌న్‌లోకి వ‌చ్చాం. తొలి సినిమా వినాయ‌క్‌తో దిల్ చేశాం. ఆ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నాం. దిల్ ద్వారా సుకుమార్ తో మొదలై.. బోయ‌పాటి శ్రీను, భాస్క‌ర్, వంశీ, శ్రీకాంత్ అడ్డాల‌, వేణు.. ఇలా ఎనిమిది మందిని దర్శకులను ప‌రిచ‌యం చేశాం. వాళ్లంద‌రూ స‌క్సెస్‌ఫుల్ ద‌ర్శ‌కులే. అందుకు చాలా సంతోషంగా ఉంది. కథను నమ్ముకుని వెలుతున్నాం కాబట్టే మాకు ఇన్ని సక్సెస్ లు వచ్చాయి అని దిల్ రాజు తెలిపారు.

 

ఈ ఇయ‌ర్ మా సంస్థ‌కు రెండు హ్యాట్రిక్‌లు వ‌స్తాయ‌ని నేను అనుకోలేదు. ఆరు సినిమాలు వ‌స్తాయ‌ని ఊహించలేదు. భ‌గ‌వంతుడు ఇలా డిజైన్ చేశారు. `శ‌త‌మానం భ‌వ‌తి`, `నేను లోక‌ల్‌` త‌ర్వాత అంద‌రికీ తెలిసిందే.. అప్ప‌టికి ప్లాన్డ్ గా ఉన్నాను. ముందర ఆరు సినిమాలు క‌నిపిస్తున్నాయి. వాట‌న్నిటినీ హిట్ చేయాల‌ని, నువ్వు ఈ ప్రాజెక్టు చూసుకోవాలి, నువ్వు ఇది చూసుకోవాలి అని అంద‌రం ప్లాన్ చేసుకుంటున్నాం. డీజే షూటింగ్ జ‌రుగుతుంటే అబుద‌బీకి వెళ్లాను. అక్క‌డి నుంచి ఫారిన్ వెళ్లాలి. ఫిదా అప్ప‌టికి రెండు షాట్‌లు చూశాను... అనుకోకుండా విషాద వార్త(భార్య మరణం) వినాల్సి వచ్చింది. ఆ వార్త విన్న వెంటనే ఇండియా వచ్చేశాను.

 

రాగానే ఫ్లైట్ దిగుతుంటే... అస‌లు ఏం జ‌రుగుతుందో, ఎలా అవుతుందో నాకు తెలియ‌లేదు. ఎక్క‌డ డ్రాప్ అవుతానోన‌ని అనుకున్నా. గుడ్ ఫ్యామిలీ, గుడ్ ఫ్రెండ్స్ లేకుంటే జీవితంలో మ‌నం ముందుకు వెళ్ల‌లేం. ఈ ఆరు స‌క్సెస్‌ల వెన‌కాల నా ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్యామిలీ ఉంది. ఎంద‌రో నాకు ఈ ఏడెనిమిది నెల‌ల నుంచి మోర‌ల్ స‌పోర్ట్ ఇచ్చారు. దాంతోనే నేను సాధించాను. ఇది నా ఒక్కడి విజయం కాదు అని దిల్ రాజు తెలిపారు. ఆ 12 రోజులు వంశీ, సురేందర్, ప్ర‌కాష్ రాజ్‌గారు నన్ను జాగ్రత్తగా చూసుకునే వారు, మోరల్ గా బూస్టప్ ఇచ్చేవారు.... అని దిల్ రాజు గుర్తు చేసుకున్నారు.

 

స‌క్సెస్ ఉన్న‌ప్పుడు అంద‌రూ పొగుడుతారు అది కామ‌నే. సినిమా ప‌రిశ్ర‌మ‌లో స‌క్సెస్ మనల్ని నిలబెడుతుంది. కానీ ఫెయిల్యూర్ ఉన్న‌ప్పుడే మోర‌ల్ స‌పోర్ట్ కావాలి. మున్నా సినిమా పోయినపుడు వంశీ మోరల్ గా ఎంత వీక్ అయ్యాడో నాకు తెలుసు. అలాగే వేణు కూడా. వారిద్దరూ కూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా నా పక్కన నిలబడటం చాలా ఆనందంగా ఉంది. స‌క్సెస్ ఉన్న‌వాళ్ల‌తో సినిమాలు చేస్తే అది ఆటోమేటిగ్గా వ‌చ్చేస్తుంది. కానీ డ్రాప్ అయిన వారితో కలిసి విజయం సాధించినపుడే నిజమైన సక్సెస్. లైఫ్ లో ఇది నేను ఎక్స్ పీరియన్స్ చేశాను. ఇది ఆరు సినిమాల‌నే ఈవెంట్‌లాగానే చేద్దామ‌నుక‌న్నా. కానీ ఎమోష‌న‌ల్ డ్రైవ్ అయిపోయింది అని దిల్ రాజు తెలిపారు.

 

నాకు ఆ ఇన్సిడెంట్(భార్య మరణం) అయిన తర్వాత నా ద‌గ్గ‌ర‌కు మొదట వచ్చింది రత్నం, శేఖ‌ర్‌గారు. ఫస్ట్ వారికి నేను చెప్పింది ఒకటే. మొదట మీరు మీ వర్క్ చేయండి అన్నాను. వారు యు.ఎస్‌.లో అనుకున్నది అనుకున్నట్లు కంప్లీట్ చేసుకుని వ‌చ్చారు కాబ‌ట్టి ఫిదా ఒక క్లాసిక్ అయింది. తర్వాత చేసిన రాజా ది గ్రేట్ కానీ, ఎంసీఏ కానీ... ఊరికే సక్సెస్ లు రాలేదు. ఈ సినిమాలకు ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రూ బ్ల‌డ్‌, హార్ట్ పెట్టి ప‌నిచేశారు... కాబట్టే ఈ సక్సెస్ వచ్చింది అని దిల్ రాజు తెలిపారు.

 

నేను డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుండి వచ్చాను కాబట్టే నా డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను సొంత మ‌నుషులులాగా చూస్తాను. వాళ్లు సినిమాల‌ను ప్ర‌మోట్ చేసి స‌క్సెస్‌ఫుల్ సినిమాలు అయ్యేలా చేశారని దిల్ రాజు తెలిపారు. ఒక సినిమా ఊరికే వ‌చ్చేయ‌దు. సినిమా ఎవ‌రైనా చూస్తేంటే నేను గేట్ కీప‌ర్‌లాగా బయట నిలబడాలి. అక్క‌డే రియాక్ష‌న్ తెలుసుకుంటాను. అపుడే నాకు సినిమా ఫలితం అర్థమవుతుంది. మొదటి రియాక్షన్లోనే తెలుసుకుంటాను. ఒక‌వేళ సినిమా బాగోలేక‌పోతే వాళ్ల రియాక్ష‌న్ ఏంటి అనేది తెలిసిపోతుంది. ఈ ఆరు సినిమాలు కేవలం మా సక్సెస్ కాదు, ఈ సినిమాకు ప‌నిచేసిన టెక్నీషియ‌న్ల‌వి, ఆర్టిస్టులవి అందరికీ పేరు పేరున ధన్యవాదాలని దిల్ రాజు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios