కొందరు రోబో లో లవ్ స్టోరీ ఉంది. ఇందులో లేదు.నిజంగా లాజిక్ లు అవెలా...ఇవెలా ..స్క్రిప్టు ..ఇవన్నీ మాట్లాడేవాళ్ల గురించి నేను మాట్లాడను. మేధావులు ఉంటారు. స్క్రిప్టు రాసేవాళ్ళ పాయింటాఫ్ లో చూస్తే...కనిపిస్తాయి అవి..మాకు అర్దమవుతుంది. కానీ అది విజువల్ వండర్ కాబట్టి..ఎక్కడా ఆలోచించుకునే అవకాసమే ఇవ్వలేదు. ఒకటి కాగానే .. ఇంకోటి..ఒక ట్రీట్ ఇచ్చేసాడు. ఒక ఆడియన్ గా నేను మూడు సార్లు చూడగలిగాను అంటూ చెప్పుకొచ్చారు దిల్ రాజు. 

రజనీకాంత్, అక్షయ్‌ కుమార్, అమీ జాక్సన్‌ ముఖ్య తారలుగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘2.0’. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించిన ఈ సినిమా గత గురువారం (నవంబర్‌ 29) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగులో ఈ చిత్రాన్ని ఎన్‌.వి.ఆర్‌. సినిమా సంస్థ విడుదల చేసింది. రీసెంట్ గా  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ ఇలా స్పందించారు.  

అలాగే ..ఈ సినిమా గురించి చాలా భయపెట్టారు..ఎవరూ చూసిందిలేదు..రిలీజ్ కు నాలుగైదు రోజుల ముందే అక్కడ అలా అంటున్నారు..ఇక్కడ ఇలా అంటున్నారు. ఆ సెన్సార్ రిపోర్ట్ ఇది అంటున్నారు అని టాక్స్ వచ్చాయి. కానీ ఒక నమ్మకం ఉంది. నా కాలుక్యులేషన్ ఏంటంటే...ఎప్పుడు ఎవరేం మాట్లాడినా నేను ఒకటే చెప్పాను..200 కోట్లుతో తీసిన రోబోనే అలా ఉందంటే..500 కోట్లతో తీసిన 2.0 లో ఏదో ఒక మ్యాజిక్ ఇస్తాడు శంకర్..నో డౌట్ అని నమ్మా.

ఈ మధ్యకాలంలో ఏ సినిమానీ అన్నిసార్లు చూడలేదు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.21.5 కోట్లు వసూలు చేయడం చాలా ఆనందాన్ని  కలిగించింది. శంకర్‌గారు ఈ సినిమాని విజువల్‌గా హాలీవుడ్‌ స్థాయిలో చూపించారు. ఇండియన్‌ సినిమాలోనే ఇంత భారీ బడ్జెట్‌ సినిమా ఇంతవరకూ రాలేదు. ‘

మహర్షి’ షూటింగ్‌కి వెళ్లినప్పుడు ‘ఏం తీశారండీ శంకర్‌గారు. చాలా బాగుంది.. గౌతమ్‌ మళ్లీ చూడాలంటున్నాడు’ అని మహేష్ బాబుగారు అన్నారు. ఈ మాట వినగానే పిల్లలు ఈ చిత్రాన్ని ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థమైంది’’ అన్నారు.

ఇవి కూడా చదవండి.. 

'2.0' ఫస్ట్ డే కలెక్షన్స్!

'2.0' లో అక్షయ్ కుమార్ పాత్రకు ఇన్స్పిరేషన్ ఇతడే!

బాక్సాఫీస్ కి దిగిపోద్ది.. '2.0' పై నాని కామెంట్!

శంకర్ - రాజమౌళి.. మొదలైన ఫ్యాన్స్ వార్!

శంకర్ ఇచ్చిన పక్షి సందేశం.. ప్రపంచానికి ఒక వార్నింగ్!

'2.0' పైరసీ.. 12 వేల వెబ్ సైట్లు బ్లాక్!

మీడియాలో '2.0' మూవీ రివ్యూ..!

శంకర్ '2.0'పై సెలబ్రిటీల ట్వీట్స్!

'2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

2.0 ప్రీమియర్ షో రివ్యూ

'2.0' పై రాజమౌళి ట్వీట్!

'2.0'పై వారికి నమ్మకం లేదా..?

'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?

'2.0' లో శంకర్ ఏం దాచాడో..?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?