Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్2: కౌశల్ వల్లే ఇదంతా.. పెద్ద ప్లాన్ తో వచ్చారు.. గీతామాధురి కామెంట్స్!

బిగ్ బాస్ సీజన్ 2లో గురువారం ఎపిసోడ్ లో గీతామాధురి భర్త నందు హౌస్ లోకి వచ్చి సామ్రాట్ తో క్లోజ్ నెస్ పై గీతా దగ్గర మాట్లాడాడు. ఆ విషయాలన్నీ నిన్నటి ఎపిసోడ్ లో గీతా.. దీప్తితో చర్చించింది. 

bigg boss2: geetha madhuri comments on kaushal
Author
Hyderabad, First Published Sep 15, 2018, 11:03 AM IST

బిగ్ బాస్ సీజన్ 2లో గురువారం ఎపిసోడ్ లో గీతామాధురి భర్త నందు హౌస్ లోకి వచ్చి సామ్రాట్ తో క్లోజ్ నెస్ పై గీతా దగ్గర మాట్లాడాడు. ఆ విషయాలన్నీ నిన్నటి ఎపిసోడ్ లో గీతా.. దీప్తితో చర్చించింది. కౌశల్ తన గురించి అలా మాట్లాడడం వలనే ఇలా జరిగిందా అర్ధం కాలేదని చాలా కన్ఫ్యూజ్ అయ్యానని గీతామాధురి అన్నారు.

''సామ్రాట్ కి రాఖీ కట్టాను నేను రాఖీ కడుతుంటే మమ్మా అని పిలుస్తాడు నన్ను. నేను అందరితో గేమ్ ఆడాను. కానీ సామ్రాట్ తో ఆడింది మాత్రమే చూపిస్తే నేనేం చేయగలను. రోల్, అమిత్ భయ్యాలతో కూడా పాంపెరింగ్ చేశా.. అమిత్ అయితే నా వేలు తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు. ఇవన్నీ చూస్తే నేను సామ్రాట్ తో చేసింది చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఇదొక్కటే చూస్తే అలానే కనిపిస్తుంది.

అయినా కౌశల్ ఇదొక్కటే ఎలా చూస్తారు. నువ్వు, శ్యామల మాట్లాడింది కూడా అందరినీ ఉద్దేశించే మాట్లాడారు. అయినా గీత చాయిస్ ఎప్పుడు తప్పు కాదని నందుకి తెలుసు. మా క్లారిటీ మాకుంది. కౌశల్ వల్లే ఇదంతా క్రియేట్ అయిందని నా డౌట్'' అంటూ దీప్తితో చర్చించింది. అర్ధరాత్రి గీతా, దీప్తి, సామ్రాట్ ల మధ్య మరోసారి కౌశల్ గురించి చర్చ జరిగింది.

బయట కౌశల్ కి వస్తోన్న ఆదరణ గురించి తమ కుటుంబ సభ్యుల ద్వారా దీప్తి, గీతాలకు తెలిసినట్లుంది. ఇన్ని ఓట్లు, ఇంత ఆదరణ ఎలా వస్తుందని దీప్తి.. గీతాతో అనగా దానికి సమాధానంగా 'కౌశల్ ఫుల్ ప్రిపేర్డ్ గా వచ్చారు. నాకు తెలిసి నూతన్ నాయుడు గారి హెల్ప్ కూడా ఉండి ఉంటుంది' అంటూ సామ్రాట్, దీప్తిలతో చెప్పింది.  

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్2: కౌశల్ పై గీతామాధురి భర్త సెటైర్లు.. మరోసారి కౌశల్, గీతాల మధ్య వేడి చర్చ!

బిగ్ బాస్2: తనీష్ తమ్ముడిపై కౌశల్ ఆర్మీ విమర్శలు!

బిగ్ బాస్2: కౌశల్ పై తనీష్ తమ్ముడు ఫైర్!

Follow Us:
Download App:
  • android
  • ios