బిగ్ బాస్ సీజన్ 2 ఈరోజుతో 94 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. నిన్నటి నుండి హౌస్ కి కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు రావడం మొదలైంది. ఈరోజు ఎపిసోడ్ లో ముందుగా  తనీష్ కోసం అతడి తమ్ముడు వంశీ వచ్చాడు. చాలా రోజుల తరువాత అన్నని చూసిన ఆనందంలో ఎమోషనల్ అయ్యాడు. తన తమ్ముడిని హత్తుకొని ఇంట్లో వాళ్ల క్షేమ సమాచారం కనుక్కున్నాడు తనీష్.

అన్నయ్యతో కాసేపు ముచ్చటించిన వంశీ నేను కౌశల్ తో మాట్లాడాలని చెప్పి తనీష్ దగ్గర నుండి కౌశల్ దగ్గరకి వెళ్లాడు. డైనింగ్ హాల్ అందరి ముందు కౌశల్ ని ప్రశ్నిస్తూ... ''కౌశల్ గారు మీరు దీప్తికి కెప్టెన్సీ పోయినప్పుడు ఆమెపై జాలి చూపించారు. ఆమెపై కన్సర్న్ ఉందని చెప్పిన మీరు కెమెరా దగ్గరకి వెళ్లి కుదిరితే నన్ను కెప్టెన్ చేయమని ఎలా అడిగారు'' అంటూ కౌశల్ పై అసహనం వ్యక్తం చేశాడు.

ఈ విషయం విన్న దీప్తి షాక్ అయింది. కౌశల్ సమాధానం చెబుతుండగా... తనీష్ వచ్చి తన తమ్ముడిని తీసుకువెళ్లిపోయాడు. అయితే శనివారం ఎపిసోడ్ లో కౌశల్ అలా ప్రవర్తించినందుకు అతడిని ఎందుకు ప్రశ్నించలేదంటూ దీప్తి.. గీతామాధురితో చర్చించింది. కౌశల్ కోసం అతడి భార్య, ఇద్దరు పిల్లలు హౌస్ లోకి వచ్చారు. వారిని చూసి కౌశల్ చాలా ఎమోషనల్ అయ్యాడు.

కౌశల్ భార్య అతడికి ధైర్యం చెప్పి గేమ్ బాగా ఆడమని ప్రోత్సహించింది. ఇక రోల్ రైడా కోసం అతడి చెల్లెలు ప్రియాంక రాగా..ఆమెత్తి రాఖీ కట్టించుకున్నాడు రోల్. హౌస్ మేట్స్ అందరితో సరదాగా మాట్లాడిన కొద్ది సమయానికే ఆమె హౌస్ నుండి వెళ్లిపోయాల్సి వచ్చింది. గీతా మాధురి తన భర్త కోసం ఎదురుచూస్తూ మెయిన్ డోర్ దగ్గరే చాలా సేపు ఉండిపోయింది.

ఇక అతడు కన్ఫెషన్ రూమ్ నుండి గీతాతో మాట్లాడుతూ.. 'నువ్వు నా పిల్లవి. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నందు.. గీతామాధురి భర్త అని అంటుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది' అన్నాడు. ఆ వీడియోని హౌస్ లో ఉన్న టీవీలో ప్లే చేశారు బిగ్ బాస్. రేపటి ఎపిసోడ్ లో గీతా తన భర్తని కలుసుకోబోతుంది.  

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్2: తనీష్ కి దీప్తి భర్త వార్నింగ్!

బిగ్ బాస్2: ఓటింగ్ లో ఆ ఇద్దరే లాస్ట్!