Asianet News TeluguAsianet News Telugu

హిరోయిన్ శ్రీరెడ్డికి అతనితో లింకు.. పెళ్లి దాకా వెళ్తారా?

  • టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ పై యుద్ధం ప్రకటించి వార్తల్లో నిలిచిన శ్రీ రెడ్డి
  • హిరోయిన్ శ్రీ రెడ్డికి పంజాబీ సింగర్ తో ఎఫైర్
  • ఫేస్ బుక్ పరిచయం.. శ్రీ రెడ్డితో డీప్ లవ్ లో పంజాబీ సింగర్
actress srireddy link with singer will they marry

తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగౌ కౌచ్ కి వ్యతిరేకంగా... యుద్ధం ప్రకటించింది నటి శ్రీరెడ్డి. గతకొన్ని రోజులగా తెలుగు మీడియాలో పాటు నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారిన శ్రీరెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చీకటిబాగోతాలను బయటపెట్టేందుకు ఒక ఉద్యమాన్ని లేవనెత్తింది. ఇండస్ట్రీలో అవకాశాల పేరులో అమ్మాయిలను వాడుకోవడం.. తనను తనతో పాటు మరికొంతమందిని శారీరక, మానసిక హింసపై మీడియాకి ఎక్కింది ఈ తెలుగు నటి. అయితే తెలుగు పరిశ్రమ పెద్దలపై పలు సంచలన ఆరోపణలతో హాట్ టాపిక్‌గా మారిని శ్రీరెడ్డి తను ఓ సింగర్‌ను ప్రేమిస్తున్నా.. మేమిద్దరం లవ్ లో ఉన్నామని మీడియాకు అతన్ని పరిచయం చేసింది. 


ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను టాలీవుడ్‌పై యుద్ధం ప్రకటించడానికి గల కారణాలను వివరించింది. ఓ మీడియా ఛానల్ చేస్తున్న స్ట్రింగ్ ఆపరేషన్‌లో భాగంగా తనను వాళ్లు సంప్రదించారని, వాళ్లు సేకరించి ఆధారాల్లో తన ఫోటో కూడా ఉండంటం చూసి షాకయ్యా అన్నారు. అయితే తనతో పాటు చాలా మంది అమ్మాయిలు ఉన్నారని.. అయితే అందులో అమ్మాయిలను కాకుండా అబ్బాయిలను మాత్రమే బయటకు లాగడానికి ఈ స్ట్రింగ్ ఆపరేషన్‌ను చేస్తున్నట్టు వాళ్లు చెప్పారన్నారు. ఇక తనపై ఎలాంటి లైంగిక వేధింపులు జరిగాయో వాళ్ల దృష్టికి తీసుకువెళ్లానన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. 

తనపై అసత్య ప్రచారం జరుగుతుందని.. ఎవరో పడితే వాడితో పడుకునే రకం తాను కాదన్నారు. ‘నాకు చాలా గు***బలపండీ.. ఎవరైనా వచ్చి శ్రీ నువ్ నాతో పడుకో అంటే నువ్ ఎవడ్రా అసలు నన్ను అడగడానికి నువ్ ఎంత నీ బతుకు ఎంత? అని మాట్లాడతా.. నాకు తిండికి లేకపోయినా పౌరుషానికి తక్కువ లేదండీ.. అంటే ఇక్కడ నేను చేసిన తప్పులు లేవని నేను కవర్ చేసుకోవడం లేదు. నేను పతీవ్రత అని నిరూపించుకోవడానికి ట్రై చేయడం లేదు. నేను చేయాల్సింది నేను చేశాను. 

ఆల్ రెడీ నా బాయ్ ఫ్రెండ్ ఈ విషయంలో స్ట్రాంగ్‌గా ఉన్నాడు. అతను పంజాబీ.. అసలు ఊరుకోడు.. తేడాలు వస్తే తల్వార్ తెచ్చి తల నరికేస్తాడు. ఎవరైనా ఏమైనా అంటే.. అంటూ అతడి వీడియో కాల్ ఫుటేజ్‌ను రివీల్ చేసింది. అందులో అతడు మాట్లాడుతూ.. తాను పంజాబీ సింగర్‌ని అంటూ తాను హైదరాబాద్‌కు చెందిన బ్యూటిఫుల్ నటి శ్రీరెడ్డితో లవ్‌తో ఉన్నానని.. ఆమె చాలా మంచి నటి. ఆమెలో మంచి టాలెంట్ ఉంది. ఇలాంటి నటికి సపోర్ట్ చేయాలంటూ తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.


అయితే మీ లవర్ మీరు పెళ్లి చేసుకునే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది శ్రీరెడ్డి. కెరియర్ మీద ఉన్నంత ఫోకస్ పెళ్లి మీద లేదంటూ కుండబద్దలు కొట్టేసింది. భవిష్యత్ అనేది మన చేతిలో ఉండదు. ఇద్దరం కెరియర్‌లో బిజీ ఉన్నాం. అతడు పంజాబీ సింగింగ్‌లో అతడు స్టార్. అతడికి మంచి ఫాలోయింగ్ ఉంది. నేను అతడికి ఫ్యాన్‌ని. అతడు నా ఫ్యాన్. అలా మా ఇద్దరికీ కనెక్ట్ అయ్యింది. అయితే ప్రస్తుతం లవ్‌లో ఉన్నాం.. పెళ్లి అంటే ఖచ్చితంగా చెప్పలేం. అంతెందుకు బాలీవుడ్‌ను చూసుకోండి.. అక్కడ డేటింగ్ కామన్. ఇప్పుడు దీపికా-రణవీర్ లవ్‌లో ఉన్నారు వాళ్లు పెళ్లిచేసుకుంటారా అంటే.. ఏమో తెలియదు. ఎవరి జీవితాలు ఎటు వెళతాయో తెలియదు. సో ప్రస్తుతానికైతే పెళ్లి చేసుకోవాలనే అనుకుంటున్నాం.. చివరికి ఏమౌతుందో తెలియదు అంటూ తన ప్రేమకథను చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. మొత్తానికి శ్రీరెడ్డి తనను తాను ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ దీపికతో పోల్చేసుకుందంటే.. కాస్త ఎక్కువైనట్లు లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios