విశాఖపట్టణం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చలూరు మధ్య మునిగిన బోటు కోడిగుడ్ల వెంకటరమణ అనే వ్యక్తిది. కోడిగుడ్ల వెంకటరమణ జనసేన పార్టీకి చెందినవాడుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయమై స్థానిక మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.

ఈ నెల 15వ తేదీన గోదావరి నదిలో రాయల్ వశిష్ట పున్నమి బోటు మునిగిపోయింది. ఈ బోటుకు కోడిగుడ్ల వెంకటరమణ యజమానిగా తేలింది.  వెంకటరమణపై గతంలో కూడ కొన్ని కేసులు కూడ నమోదైనట్టుగా పోలీస్ రికార్డులు చెబుతున్నాయి.

స్థలాలను ఆక్రమించడం ఒకే స్థలాన్ని ఇద్దరు ముగ్గురికి విక్రయించినట్టుగా ఆరోపణలు రావడంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి.

సరిపల్లి దగ్గర 148/15 లో సుమారు 400 గజాల స్థలాన్ని పొలిశెట్టి పూర్ణిమ అనే మహిళకు వెంకటరమణ విక్రయించాడు.  ఈ భూమిలో ఇల్లు కట్టుకొనేందుకు ఆమె సర్వే చేయించగా ఆ స్థలం వేరే వారికి అంతకుముందే వెంకటరమణ విక్రయించినట్టుగా గుర్తించారు.

దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.ఈ విషయంలో వెంకటరమణతో పాటు ఆయన భార్య ప్రమేయం కూడ ఉన్నట్టు గుర్తించిన పోలీసులు వీరిద్దరిపై చీటింగ్ కేసు  నమోదు చేశారు.2009 నుండి వెంకటరమణపై అనేక కేసులు నమోదయ్యాయి. అదే ఏడాది 324,506,341 ఐపీసీ సెక్షన్లతో కేసులు పెట్టారు.  2019లో సీఆర్‌పీసీ సెక్షన్ 107తో  మరో కేసు నమోదైంది. 

2017లో ఐపీసీ 420 సెక్షన్ కింద మరో కేసు నమోదైంది. బోటు ప్రమాదంతో తాజగా మరో కేసు నమోదైంది. విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన వెంకటరమణ రాజమండ్రికి వెళ్లి అక్కడే బోటు కొని వ్యాపారం ప్రారంభించారు. ఇప్పుడు ప్రమాదానికి గురైన బోటు కాకుండా మరో బోటు కూడ వెంకటరమణకు ఉన్నట్టుగా సమాచారం.

సంబంధిత వార్తలు

బోటు మునక: 24 మృతదేహాల వెలికితీత, రెస్క్యూ ఆపరేషన్

210 అడుగుల లోతులో బోటు: మరో మూడు మృతదేహాలు వెలికితీత

బోటు మునక: దొరకని ఆచూకీ, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

మన అలసత్వం కారణంగానే ఇంత ఘోరం : బోటు ప్రమాదంపై జగన్ ఆవేదన, అధికారులపై ఆగ్రహం

గోదావరిలో బోటు మునక... ప్రమాద ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే (ఫోటోలు)

బోటు యజమానిపై కేసు నమోదు చేశాం: మంత్రి ఆళ్ల నాని

బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం

మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్

పడవ ప్రమాదం: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, రాహుల్ సంతాపం

పడవ ప్రమాదం: డ్రైవర్లు ఇద్దరూ మృతి, ఆ ప్రాంతంలో సుడిగుండం

బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం

గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..

అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్

బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు

బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం