MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Careers
  • IT Jobs : హైదరాబాద్ ఐటీకి పూర్వవైభవం.. ఉద్యోగాల భర్తీలో ఫిబ్రవరి నయా రికార్డ్

IT Jobs : హైదరాబాద్ ఐటీకి పూర్వవైభవం.. ఉద్యోగాల భర్తీలో ఫిబ్రవరి నయా రికార్డ్

2026 ఫిబ్రవరిలో భారత జాబ్ మార్కెట్ అనూహ్యంగా పుంజుకుంది. ముఖ్యంగా ఐటీ, ఏఐ రంగాల్లో నియామకాలు భారీగా పెరిగాయి. దీంతో నిరుద్యోగులకు మంచి రోజులు వచ్చినట్టేనని నిపుణులు చెబుతున్నారు.

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 05 2026, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్
Image Credit : Gemini

ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్

ఇక భవిష్యత్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే… ఇది నిజం. కానీ ఈ ఏఐ ఉద్యోగాలను మింగేస్తుంది అనే ప్రచారం మాత్రం నిజం కాదంటున్నారు నిపుణులు. ఇందుకు నిదర్శనమే గత నెలలో జరిగిన నియామకాలు.

కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న భారత వైట్ కాలర్ జాబ్ మార్కెట్ 2026 ఫిబ్రవరిలో భారీ వృద్ధిని చూసింది. ప్రముఖ జాబ్ పోర్టల్ 'Naukri Jobspeak' విడుదల చేసిన తాజా రిపోర్ట్స్ ప్రకారం… దేశంలోని ప్రధాన నగరాల్లో కంపెనీలు కొత్త నియామకాలపై ఆసక్తి చూపుతున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో ఈ జోరు ఎక్కువగా కనిపిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఐటీ (IT) రంగంలో మళ్లీ పాత ఉత్సాహం..!
Image Credit : Getty

ఐటీ (IT) రంగంలో మళ్లీ పాత ఉత్సాహం..!

ఏఐ రాకతో ఐటీ రంగం కుదేలయ్యింది… పెద్దపెద్ద కార్పోరేట్ కంపెనీలు సైతం లేఆఫ్స్ చేపట్టాయి. ఇలా సంక్షోభంలో పడినట్లు కనిపించిన ఐటీ రంగం గతనెల ఫిబ్రవరిలో ఊహించని పురోగతి సాధించింది.

ప్రపంచ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఫిబ్రవరి నెలలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డేటా అనలిస్టులు, క్లౌడ్ కంప్యూటింగ్ నిపుణులకు డిమాండ్ గణనీయంగా పెరిగింది.

35
ఏఐతోనే కొత్త ఉద్యోగాలు..
Image Credit : Gemini AI

ఏఐతోనే కొత్త ఉద్యోగాలు..

ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కీలక పాత్ర పోషిస్తోంది. ఫిబ్రవరి రిపోర్ట్స్ ప్రకారం… ఏఐ, మెషిన్ లెర్నింగ్ (ML) సంబంధించిన ఉద్యోగాలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. ChatGPT వంటి టెక్నాలజీలు వచ్చాక, కంపెనీలు తమను తాము అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఏఐ నిపుణుల కోసం వెతుకుతున్నాయి. ఇది యువతకు గొప్ప అవకాశంగా మారింది.

45
బెంగళూరు తర్వాత హైదరబాదే...
Image Credit : our own

బెంగళూరు తర్వాత హైదరబాదే...

ఈ ఉద్యోగాల పెరుగుదలలో మెట్రో నగరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 'భారత సిలికాన్ వ్యాలీ'గా పిలిచే బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతిస్థానం హైదరాబాద్ దే. ఇక పుణె, చెన్నై నగరాల్లో జాబ్ మార్కెట్ 10% నుంచి 15% వరకు వృద్ధిని నమోదు చేసింది. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ (BFSI) రంగాల్లో నియామకాలు ఎక్కువగా జరిగాయి.

55
2026లో ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉంటుంది?
Image Credit : Getty

2026లో ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉంటుంది?

2026 సంవత్సరం ప్రారంభం జాబ్ మార్కెట్‌కు చాలా సానుకూలంగా ఉంది. కంపెనీలు ఇప్పుడు కేవలం డిగ్రీని మాత్రమే కాకుండా, 'స్కిల్-బేస్డ్' (నైపుణ్య ఆధారిత) నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కాబట్టి, ఉద్యోగార్థులు కొత్త టెక్నాలజీలు నేర్చుకుంటే అవకాశాలు మెరుగవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
హైదరాబాద్
బెంగళూరు
కృత్రిమ మేధస్సు
సాంకేతిక వార్తలు చిట్కాలు
విద్య
ఏషియానెట్ న్యూస్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
విశాఖపట్నం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే
Recommended image2
Free Education: ఉచిత విద్యను అందించే దేశాలు.. ఇక్కడ ఫ్రీగా చదువుకోవచ్చని మీకు తెలుసా?
Recommended image3
Indian IT jobs Australia vs Switzerland: మనోళ్లకు జాబ్స్, లైఫ్ సెటిల్‌మెంట్ కోసం ఏ దేశం బెస్ట్?
Related Stories
Recommended image1
Indian Air Force Jobs : కేవలం తెలుగు యువతకు మాత్రమే.. ఇంటర్ అర్హతతోనే భారత వాయుసేనలో ఉద్యోగావకాశాలు
Recommended image2
Jobs : రంగాల వారీగా టార్గెట్స్ ఫిక్స్... ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved