అమరావతి:  అమరావతిపై రాజకీయ రగడ కొసాగుతోంది. ఏపీలో నాలుగు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేస్తారనే ప్రచారం ప్రారంభమైంది. బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. అమరావతి విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలన్నీ అమరావతిపై అనుమానాలను మరింత రెట్టింపు చేస్తున్నాయని విపక్షాలు అరోపిస్తున్నాయి.

మరోవైపు అమరావతిని రాజధానిగా కొనసాగించే ఉద్దేశ్యం జగన్ కు లేదని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ ప్రకటించడం కలకలం రేపింది. నాలుగు రాజధానులు ఏర్పాటు చేసేందుకు జగన్ ప్లాన్ చేశాడని ఆయన అభిప్రాయపడ్డారు.

మరో వైపు తాజాగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఇదే సమయంలో ప్రకాశం జిల్లా దొనకొండలో భూములకు రెక్కలోచ్చాయి. అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పడిపోయాయి.

ఏపీలో నాలుగు రాజధానులు చేయాలని జగన్ అభిమతంగా ఉందని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.ఈ విషయాన్ని జగన్ ఢిల్లీలో బీజేపీ నేతలకు చెప్పారని వెంకటేష్ బయటపెట్టారు. 

టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు అమరావతిపై ఇటీవల కాలంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేస్తున్న వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా ఉన్నాయని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజధాని ప్రకాశం జిల్లాలో ఉంటే ఎలా ఉంటుందనే విషయమై తనతో చిట్ చాట్ చేశారని ఎంపీ టీజీ వెంకటేష్ గుర్తు చేసుకొన్నారు. అయితే ఈ విషయమై వైఎస్ఆర్ ఆనాడు నిర్ణయం తీసుకోలేదన్నారు.

వైఎస్ జగన్ మాత్రం అమరావతి విషయంలో వ్యూహత్మకంగా ముందుకు వెళ్లున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. రాష్ట్రంలో నాలుగు ప్రాంతీయ అభివృద్ది బోర్డులను ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నారు. ఈ ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేసే ప్రాంతాలను రాజధానులుగా మార్చే అవకాశం లేకపోలేదనే ప్రచారం సాగుతోంది.. ఇదే రకమైన అభిప్రాయాన్ని టీజీ వెంకటేష్ వ్యక్తం చేశారు.

జగన్  మంత్రి వర్గంలో ఐదుగురికి డిప్యూటీ సీఎంలను కేటాయించడం కూడ  ఇందులో భాగమేననే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. గుంటూరు, కాకినాడ, కడప,విజయనగరంలను రాజధానులుగా ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. 

రాజధాని ప్రాంతం మంగళగిరి నియోజకవర్గం పరిధిలోకి వస్తోంది. చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ ఈ స్థానం నుండి పోటీ చేసీ వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. రాజధానిని అభివృద్ది చేశామని చంద్రబాబు ప్రభుత్వం ఆనాడు ప్రచారం చేసింది.

 రాజధాని భూములను వెనక్కిఇప్పిస్తామని జగన్ సర్కార్ చేసిన ప్రచారానికి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చారని బీజేపీ ఎంపీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు.అందుకే లోకేష్ ను మంగళగిరి ప్రజలు ఓడించారన్నారు.

అమరావతిని అభివృద్దిని చేస్తే ఆ క్రెడిట్ చంద్రబాబుకు దక్కే అవకాశం ఉంది. అదే జరిగితే  చంద్రబాబుకు రాజకీయంగా ప్రయోజనం కలిగే అవకాశం లేకపోలేదని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు అభిప్రాయంతో ఉండి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం చేసే వారు కూడ లేకపోలేదు.

అమరావతిలో నిర్మాణ వ్యయం ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగా ఉందని ప్రభుత్వం వాదిస్తోంది. అమరావతి పేరుతో టీడీపీకి చెందిన నేతలు చంద్రబాబు సన్నిహితులు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేశారని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజధాని  విషయంలో జగన్ సర్కార్ చేస్తున్న ప్రకటనలతో ఈ ప్రాంతంలో భూముల ధరలు గణనీయంగా పడిపోయాయి.

అయితే ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో భూముల ధరలు పెరిగిపోతున్నాయి. రాజధాని ప్రాంతం దొనకొండలో ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని ప్రచారం కావడంతో ఈ ప్రాంతంలో భూముల ధరలు పెరిగిపోయాయి.

రాజధాని విషయంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.ఈ ఆరోపణలను నిరూపించాలని టీడీపీ నేతలు సవాల్ చేస్తున్నారు.

రాజధానిని  అమరావతిని నుండి మార్చుతున్నట్టుగా జగన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. కానీ పురపాలక శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన మాత్రం వివాదాస్పదంగా మారింది.

రాజధాని ఏ ఒక్క సామాజిక వర్గానికి పరిమితం కాదు... అందరిదన్నారు. వరద ఎక్కువగా వస్తే ఈ ప్రాంతం ముంపుకు గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. పవన్ కళ్యాణ్ రాజధాని విషయంలో చేసిన వ్యాఖ్యలను కూడ బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. మొత్తంగా అమరావతిపై జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకొంటారనేది  ప్రస్తుతం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

అమరావతిని మారిస్తే విపక్షాలు ఆందోళనలు చేసే అవకాశం లేకపోలేదు.అయితే అధికార వికేంద్రీకరణ పేరుతో ఇతర ప్రాంతాల్లో కూడ రాజధానులు ఏర్పాటు చేసే అవకాశం ఉండి ఉండొచ్చనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

అధికార వికేంద్రీకరణతో పాటు అన్ని ప్రాంతాల అభివృద్దికి కూడ నాలుగు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ కారణంగానే నాలుగు ప్రాంతాల్లోరాజధానులు ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసి ఉంటారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

 

సంబంధిత వార్తలు

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నా చంద్రబాబు ఇల్లే కనబడుతుందా..? మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది: టీడీపీపై సుజానా సెటైర్లు

రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే