కేబినెట్లోకి కేటీఆర్, హరీష్ డౌటే?: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Aug 28, 2019, 5:50 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.
 

ముంపు చూపిస్తే మూడున్నరెకరాలు రాసిస్తా: బొత్సకు మహిళా రైతు సవాల్

రాజధానికి అమరావతికి వరద ముప్పు ఉందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజధాని ప్రాంతానికి చెందిన ఓ మహిళా రైతు ఆయనకు సవాల్ విసిరారు. అమరావతికి ముందు ఉందని చూపిస్తే తనకున్న మూడున్నర ఎకరాల పొలం రాసిస్తానని బత్తుల గంగాభవాని అనే రైతు తెలిపారు. 

 

బిగ్ బాస్ 3: చెప్పు తెగుద్ది బేవర్స్.. రాహుల్ ని తిట్టిన హిమజ!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 3 విజయవంతంగా 37 ఎపిసోడ్‌లను ముగించుకుని 38వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. నామినేషన్‌ అయిన ఆరుగురిలో ముగ్గురికి బిగ్ బాస్ ఇచ్చిన డీల్ రచ్చరచ్చయ్యింది.
 

బిగ్ బాస్ 3: వితికా మొహం మీద కాఫీ కొట్టిన వరుణ్

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 3 విజయవంతంగా 37 ఎపిసోడ్‌లను ముగించుకుని 38వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. నామినేషన్‌ అయిన ఆరుగురిలో ముగ్గురికి బిగ్ బాస్ ఇచ్చిన డీల్ రచ్చరచ్చయ్యింది.

 

కాషాయం కప్పుకున్నా..గుండె నిండా బాబే: సుజనాపై విజయసాయి ఫైర్

మీరు శుద్ధపూసలా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నా.. మీ హృదయం నిండా బాబే ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కోవర్టుగానే బీజేపీలో చేరారని.. మీ ప్రతి చర్యను బీజేపీ అధిష్టానం గమనిస్తోందని విజయసాయి ధ్వజమెత్తారు. 

 

ఫోర్జరీ సంతకాలు.. భూమి విక్రయం: మాజీ మంత్రి సోమిరెడ్డిపై కేసు నమోదు

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఫోర్జరీ సంతకాలతో ఇడిమేపల్లిలో 2.40 ఎకరాలు అమ్మినట్లు సోమిరెడ్డి సహా పలువురిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయనతో పాటు మరో ముగ్గురిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు

 

అమరావతి భూములపై బొత్స ఆరోపణలు: బాలయ్య చిన్నల్లుడు భరత్ క్లారిటీ

అమరావతిపై బురద చల్లడానికి తనను పావుగా వాడుకుంటున్నారని భరత్ విమర్సించారు. తనను చూపించి వేలాది మంది రైతులకు అన్యాయం చేయవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

 

టీడీపీ నేతలకు కేసుల ఉచ్చు: కోడెలతో మొదలు పెట్టి...

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలపై గత కొన్ని నెలలుగా కేసులు నమోదవుతున్నాయి. బాధితుల ఫిర్యాదుల వల్ల ఇలా జరుగుతుందా లేక వీటి వెనుక ఎవరైనా ఉన్నారా అనుమానాలు కలుగుతున్నాయి. అయితే వేలు మాత్రం వైసీపీ ప్రభుత్వంపైనే చూపిస్తోంది.

 

కేసులు పెడతారని ఊహించా: సోమిరెడ్డి

అమరావతి: తనపై తప్పుడు కేసులు పెడతారని ముందే ఊహించినట్టుగా  మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు.

 

ఆ భజన వల్లే చంద్రబాబు ఓటమి: కొడాలి నాని సెటైర్లు

అన్ని అంశాలను వదిలి రెండు అంశాలను పట్టుకొని చంద్రబాబు వేలాడడం వల్లే ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడని ఏపీ మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు. 

 

అమరావతిలో రాజధానిని కొనసాగించే ఉద్దేశ్యం జగన్‌కి లేదు: జీవీఎల్ వ్యాఖ్యలు

ఏపీ రాజధాని అమరావతి విషయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రాజధానిని కొనసాగించే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం లేదంటూ వ్యాఖ్యానించారు. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉందని.. దీనిపై వెంటనే స్పష్టత ఇవ్వాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.

 

టీటీడీ పాలకమండలిపై జగన్ కసరత్తు: పరిశీలనలో కేసీఆర్ మిత్రుడు

టీటీడీ పూర్తిస్థాయి పాలకవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. బుధవారం నాడు పూర్తి స్థాయి పాలకవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

బంపర్ ఆఫర్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కవిత?

టీఆర్ఎస్ లో కేసీఆర్ కవితకు కీలక పదవిని అప్పగించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఆమెకు పార్టీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు.

 

వినోద్ కుమార్ కు కేసీఆర్ పదవి: పరాజితుల్లో చిగురిస్తున్న ఆశలు

ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలకు నామినేటేడ్ పోస్టులను కట్టబెట్టే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

 

లంచాల వ్యవస్థ ఉండకూడదు: రెవెన్యూశాఖ సమీక్షలో సీఎం జగన్

ఆయా శాఖల నివేదికలను పరిశీలించిన సీఎం జగన్ వాణిజ్యపన్నుల్లో 14శాతం వృద్ధి ఉండాల్సి ఉండగా 5.3శాతానికి తగ్గడంపై ఆరా తీశారు. గడచిన నాలుగు నెలల్లో  ఆదాయంలో అనుకున్నంతమేర వృద్ధి లేదని అధికారులు వివరించారు. 

దేవిశ్రీప్రసాద్ ని బన్నీ దూరం పెడుతున్నాడా..?

దేవి ఈ మధ్య అసలు ఫాంలో లేకపోవడం, తమ సినిమాలన్నింటికీ ఒకేరకమైన పాటలుంటాయనే విమర్శలు ఎక్కువ అవడంతో దేవిశ్రీ ప్రసాద్ పని పట్ల బన్నీకి ఆసక్తి తగ్గినట్లుంది. 

 

మ్యూజిక్ డైరెక్టర్ పై అనంత శ్రీరామ్ షాకింగ్ కామెంట్స్!

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనంత శ్రీరామ్ ఓ మ్యూజిక్ డైరెక్టర్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మీ పాట బాలేదు తీసేయాలని ఎవరైనా అన్నారా..? అని ప్రశ్నించగా ఉన్నారని బదులిచ్చాడు అనంత శ్రీరామ్. సరిగా రాయకపోవడం వల్ల  బాలేదని చెప్తే కచ్చితంగా ఇంకొంచెం సామర్ధ్యం పెంచుకొని రాస్తానని కానీ ఒక సంఘటన తనను బాధించిందని చెప్పారు. 
 

వేములవాడలో స్కూల్ వ్యాన్‌ బోల్తా, ముగ్గురు చిన్నారుల దుర్మరణం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ వ్యాన్ బోల్తాపడి వేములవాడలో స్కూల్ వ్యాన్‌ బోల్తా, ముగ్గురు చిన్నారులు దుర్మరణం చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. ఉదయం విద్యార్ధులతో స్కూలుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు వేములవాడ శివారులోని అయ్యప్ప ఆలయం వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. 

 

హైదరాబాద్ నా మానసపుత్రిక, తెలుగురాష్ట్రాల్లో టీడీపీ అవసరం చారిత్రాత్మకం : చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఓటమిపాలైనంత మాత్రాన తాను కృంగిపోవాల్సిన అవసరం లేదన్నారు. తాను ఆశావాదినని ఎప్పుడూ అధైర్యపడే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.  తెలంగాణలో నాయకులు వెళ్లారు కానీ కార్యకర్తలెవరూ పార్టీని వీడలేదని చెప్పుకొచ్చారు.  
 

'సాహో' రిలీజ్ కి ముందే రికార్డులు.. 'బాహుబలి'కి మించి!

ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రం భారీ అంచనాల నడుమ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్యాన్ ఇండియా చిత్రంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలౌతున్న ఈ చిత్రం విడుదలకు ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది.
 

సాహోపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ప్రభాస్ సినిమా అయితే ఏంటి!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. విడుదల సమయం దగ్గరపడే కొద్దీ సినిమాపై అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో దేశం మొత్తం సాహో ఫీవర్ నెలకొంది.


కోట్లలో బ్రహ్మీ ఆస్తి.. కానీ కొడుకుల పరిస్థితి ఏంటో తెలుసా..?

90ల కాలం నుండి బ్రహ్మీ తను సంపాదించిన మొత్తాన్ని రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసి మరింత సంపాదించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఆయనకి రూ.800 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఇంత ఆస్తి ఉన్నప్పటికీ బ్రహ్మానందం తన కొడుకుల మీద మాత్రం ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా లేరని సమాచారం. 

 

నాగార్జున ఆరోగ్యంపై పుకార్లు.. అసలు నిజమేంటంటే..?

తీవ్రమైన వెన్ను నొప్పితో పాటు.. కొన్ని కీళ్ల సమస్యలతో నాగార్జున బాధపడుతున్నాడంటూ నిన్నంతో సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. 


 

click me!