టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఫోర్జరీ సంతకాలతో ఇడిమేపల్లిలో 2.40 ఎకరాలు అమ్మినట్లు సోమిరెడ్డి సహా పలువురిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయనతో పాటు మరో ముగ్గురిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇడిమేపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 58-3లో 2.40 ఎకరాల తన భూమిపై ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి మరొకరికి రిజిస్ట్రేషన్ చేసినట్లు 2017 ఏప్రిల్ 6న వేలూరు రంగారెడ్డి అనే వ్యక్తి సోమిరెడ్డిపై కోర్టుకెక్కారు.

న్యాయస్థానం ఆదేశాల మేరకు సోమిరెడ్డితో పాటు భూమి కొనుగోలు చేసిన మేఘనాథన్, జయంతి, అప్పటి వెంకటాచలం సర్వేయర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.