కశ్మీర్ పై రాహుల్ ట్వీట్స్... అనుకూలంగా మార్చుకున్న పాక్

By telugu teamFirst Published Aug 28, 2019, 4:08 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ చేసిన ట్వీట్లను పాకిస్తాన్ ఐకరాజ్య సమితిలో తనకు అనుకూలంగా మార్చుకుంది. దీంతో వెంటనే రాహుల్ ట్విట్టర్ వేదికగా మరోసారి స్పందించారు. కశ్మీర్ అంశం భారత్ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పారు. ఈ విషయంలో పాక్ సహా ఏ దేశం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన ట్వీట్ చేశారు. 

కశ్మీర్ పై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేశాయి. దీంతో.. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ కి ఉన్న స్వయం ప్రతిపత్తిని తొలగించడంతోపాటు రెండు రాష్ట్రాలుగా విభజించిన సంగతి తెలిసిందే. కాగా... కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన ట్వీట్లను పాకిస్తాన్ తనకు అనుకూలంగా మార్చుకుంది.

కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ చేసిన ట్వీట్లను పాకిస్తాన్ ఐకరాజ్య సమితిలో తనకు అనుకూలంగా మార్చుకుంది. దీంతో వెంటనే రాహుల్ ట్విట్టర్ వేదికగా మరోసారి స్పందించారు. కశ్మీర్ అంశం భారత్ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పారు. ఈ విషయంలో పాక్ సహా ఏ దేశం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన ట్వీట్ చేశారు. 

ప్రభుత్వంతో తమకు చాలా విభేదాలు ఉన్నప్పటికీ కశ్మీర్ విషయంలో మాత్రం ఎన్డీయే సర్కార్ తీసుకున్న నిర్ణయానికే తమ మద్దతు ఉంటుందని రాహుల్ ట్విట్టర్ లో స్పష్టం చేశారు. పాక్ వల్లే జమ్మూకశ్మీర్ లో హింస చెలరేగుతోందని రాహుల్ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా... ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు సాధారణంగా లేవని అక్కడి ప్రజలు స్వాతంత్ర్యం, పౌర స్వేచ్ఛను కోల్పోయి బతుకుతున్నారంటూ పార్టీ తరఫున కాంగ్రెస్, ఇటు రాహుల్ గాంధీ ట్వీట్లు చేశారు. ఇవే విషయాలను పాక్ ఐక్యరాజ్య సమితికి పంపిన నివేదికలో ప్రస్తావించింది. దీంతో కాంగ్రెస్ తీవ్ర చిక్కుల్లో పడింది. పాక్‌కు మద్దతుగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు దిగింది.

click me!