రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ వ్యాన్ బోల్తాపడి వేములవాడలో స్కూల్ వ్యాన్‌ బోల్తా, ముగ్గురు చిన్నారులు దుర్మరణం చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. ఉదయం విద్యార్ధులతో స్కూలుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు వేములవాడ శివారులోని అయ్యప్ప ఆలయం వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. మరో విద్యార్ధి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని గాయపడ్డ విద్యార్ధిని వేములవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్ వేములవాడకు బయలుదేరారు. 

 

"