బిగ్ బాస్ షోలో మంగళవారం నాటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చినటాస్క్ లు హౌస్ మేట్స్ మధ్య చిచ్చు రేపాయి. ఈ వారం నామినేట్ అయిన ఆరుగురిలో సభ్యుల్లో సేఫ్ కావాల్సిన ముగ్గురు ఎవరో మీలో మీరే చర్చించుకొని తేల్చుకోమని బిగ్ బాస్ నామినేట్ అయిన వారికి చెప్పారు. ఫైనల్ గా రవి, రాహుల్, వరుణ్ లు బిగ్ బాస్ తో డీల్ కి సిద్ధమయ్యారు. డీల్ లో 
భాగంగా వీరు కొన్ని టాస్క్ లు చేయాల్సి వచ్చింది.

ఈ క్రమంలో రాహుల్, హిమజల మధ్య మాటల యుద్ధం జరిగింది. తన ఛాలెంజ్ పూర్తిచేయడంలో భాగంగా రాహుల్ మరోసారి ఇంటిలో ఫాల్తు మాటలు మాట్లాడాడు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా రాహుల్.. ఇంట్లో ఒకరికి బాగా కోపం తెప్పించి వారు మీపై అరిచేలా చేసి వారితో గొడవ పడాలి. అలానే వరుణ్, వితికల హార్ట్ షేప్ కుషన్‌ని కట్ చేసి స్విమ్మింగ్ పూల్‌లో విసరాలి.

ముందుగా కుషన్ నికట్ చేసి స్విమ్మింగ్ పూల్ లో విసిరాడు రాహుల్. ఆ తరువాత రాహుల్ ని అలీ, శ్రీముఖి, శివజ్యోతి, బాబా భాస్కర్ లు అడ్డుకున్నారు.  రాహుల్‌ని కదలనివ్వకుండా వీరు అడ్డుపడడంతో వారిని రాహుల్ నెట్టే ప్రయత్నం చేశాడు. శ్రీముఖిని బలంగా పక్కకి నెట్టాడు. దీంతో శ్రీముఖి.. రాహుల్ తో గొడవకి దిగింది. ఆ తరువాత వితికాను ఎందుకు లేపుతున్నావంటూ అరుచుకుంటూ మీద పడింది హిమజ.

దీంతో రాహుల్.. 'పిచ్చి మెంటలా నీకు.. ఫాల్తు మొఖం చేతలు చేయకు' అన్నాడు. ఆగ్రహం తెచ్చుకున్న హిమజ.. 'మొహం పగిలందంటే.. చెప్పుతెగుద్ది చెబుతున్నాను.. బేవార్స్' అంటూ అతడిపై తిట్ల దండకం మొదలుపెట్టింది. 

బిగ్ బాస్ 3: వితికా మొహం మీద కాఫీ కొట్టిన వరుణ్