హైదరాబాద్: కేటీఆర్ ను కేబినెట్ లోకి తీసుకొంటే కవితకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కల్పించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఆమె నిజామాబాద్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని గత ఏడాది డిసెంబర్ మాసంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కేటీఆర్ కు కట్టబెట్టారు కేసీఆర్. పార్టీని సమర్ధవంతంగా కేటీఆర్ ముందుకు తీసుకెళ్తున్నాడు. 

ప్రోటోకాల్ విషయంలో కేటీఆర్ కొన్ని ఇబ్బందులు ఎదురౌతున్నాయి.ఈ సమయంలో ఆయనను మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశాలు ఉన్నాయని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

కేటీఆర్ ను మంత్రివర్గంలోకి తీసుకొంటే పాలన వ్యవహరాల్లో ఆయన బిజీగా ఉండే అవకాశం ఉంది. దీంతో పార్టీ వ్యవహరాలను చూసుకొనేందుకు కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అప్పగించే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

వచ్చే ఏడాది ఏప్రిల్ మాసంలో రెండు  రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి.ఈ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాలను  వినోద్ , కవితలకు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు.

వినోద్ కు రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మెన్ గా బాధ్యతలు ఇచ్చారు కేసీఆర్. కవితకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు కట్టబెట్టి రాజ్యసభకు పంపే అవకాశం ఉందనే ప్రచారం కూడ సాగుతోంది.

సంబంధిత వార్తలు

విస్తరణపై కేసీఆర్ దృష్టి: కేబినెట్‌లోకి కేటీఆర్, హరీష్ డౌటే?

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?
దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

ఎమ్మెల్సీగా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవం: మంత్రి పదవికి దక్కేనా?