Asianet News TeluguAsianet News Telugu

కోట్లలో బ్రహ్మీ ఆస్తి.. కానీ కొడుకుల పరిస్థితి ఏంటో తెలుసా..?

90ల కాలం నుండి బ్రహ్మీ తను సంపాదించిన మొత్తాన్ని రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసి మరింత సంపాదించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఆయనకి రూ.800 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఇంత ఆస్తి ఉన్నప్పటికీ బ్రహ్మానందం తన కొడుకుల మీద మాత్రం ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా లేరని సమాచారం. 

brahmanandam is still lukewarm to splurge  money for his sons
Author
Hyderabad, First Published Aug 28, 2019, 12:54 PM IST

కమెడియన్ బ్రహ్మానందంకి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ప్రస్తుతం యంగ్ కమెడియన్ల హవా పెరగడంతో బ్రహ్మీ డిమాండ్ తగ్గిందే కానీ ఒకప్పుడు రోజుకి రూ.7 లక్షల చొప్పున రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ కమెడియన్ అతడు. ఏడాదికి బ్రహ్మీ సంపాదన స్టార్ హీరోల రెమ్యునరేషన్ కి మించి ఉండేది. 90ల కాలం నుండి బ్రహ్మీ తను సంపాదించిన మొత్తాన్ని రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసి మరింత సంపాదించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఆయనకి కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఇంత ఆస్తి ఉన్నప్పటికీ బ్రహ్మానందం తన కొడుకుల మీద మాత్రం ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా లేరని సమాచారం. బ్రహ్మీ పెద్ద కొడుకు గౌతం ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నాడు.

అలానే చిన్న కొడుకు సిద్ధార్థ్ దర్శకుడిగా, హీరోగా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. అయితే తన కొడుకులతో ఆస్తిని అనుభవించండని చెప్పిన బ్రహ్మీ సినిమాల మీద మాత్రం పెట్టుబడి పెట్టడానికి వీలులేదని ఖరాఖండిగా చెప్పేశాడట. ఆ కారణంగానే గౌతం సినిమా సినిమాకి చాలా గ్యాప్ ఇస్తున్నాడు. ఇంట్లో తండ్రి పెట్టుబడి పెట్టకపోవడంతో నిర్మాతల కోసం వెతుకుతూ తన పాట్లు తను పడుతున్నాడు. 

ఇక రెండో కొడుకు సిద్ధార్థ్ కి ఇంటి నుండి సరైన సపోర్ట్ లేకపోవడంతో ఇండస్ట్రీలోకి రావడానికి ఇన్వెస్టర్స్ కోసం చూస్తున్నాడట. మోహన్ బాబు, బెల్లంకొండ, అల్లు అరవింద్ లాంటి వాళ్లు కొడుకులను ఇండస్ట్రీలో నిలబెట్టడానికి కోట్లు కుమ్మరిస్తుంటే.. బ్రహ్మీకి మాత్రం అలాంటి ఆలోచన లేనట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios