Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ నేతలకు కేసుల ఉచ్చు: కోడెలతో మొదలు పెట్టి...

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలపై గత కొన్ని నెలలుగా కేసులు నమోదవుతున్నాయి. బాధితుల ఫిర్యాదుల వల్ల ఇలా జరుగుతుందా లేక వీటి వెనుక ఎవరైనా ఉన్నారా అనుమానాలు కలుగుతున్నాయి. అయితే వేలు మాత్రం వైసీపీ ప్రభుత్వంపైనే చూపిస్తోంది.

Stage set for TDP-YSRCP battle through police cases
Author
Amaravathi, First Published Aug 28, 2019, 1:01 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలపై గత కొన్ని నెలలుగా కేసులు నమోదవుతున్నాయి. బాధితుల ఫిర్యాదుల వల్ల ఇలా జరుగుతుందా లేక వీటి వెనుక ఎవరైనా ఉన్నారా అనుమానాలు కలుగుతున్నాయి. అయితే వేలు మాత్రం వైసీపీ ప్రభుత్వంపైనే చూపిస్తోంది.

గతంలో ప్రభుత్వం మారినప్పుడల్లా ప్రత్యర్ధి పార్టీలకు చెందిన సానుభూతిపరులపై భౌతికదాడులకు దిగడమో లేదంటే హతమార్చడమో జరిగేది. 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ నేతలు, కార్యకర్తలను వేటాడి వెంటాడి మరీ చంపారు. అయితే ఇప్పుడు దాని స్థానంలో మరోలా కక్షసాధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

టీడీపీ సీనియర్ నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు పల్నాడు ప్రాంతంలో గట్టిపట్టు వుంది. ఆయనపై గతంలో ఫ్యాక్షన్, బెదిరింపు ఆరోపణలు వచ్చాయి. కానీ కేసులు నమోదైంది మాత్రం నామమాత్రమే.

అయితే ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి రావడంతో.. కోడెల ‘‘కే ట్యాక్స్ ’’ వ్యవహారం రాజకీయంగా పెనుదుమారాన్ని రేపింది. కోడెల కుమార్తె విజయలక్ష్మీ, కుమారుడు శివరామ్ అనేక మందిని బెదిరించడంతో పాటు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని అనేకమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారం ఇప్పటికీ సద్ధుమణగపోగా.. కొత్తగా అసెంబ్లీ ఫర్నీచర్ దారి మళ్లీంపు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కోడెల స్పీకర్‌గా ఉన్న కాలంలో శాసనసభకు చెందిన ఫర్నీచర్‌ను సొంతానికి వినియోగించుకున్నారన్న వార్తతో శివప్రసాద్‌ చిక్కుల్లో పడ్డారు.

ఇక గుంటూరు జిల్లాకే చెందిన గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేనిని సైతం కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అక్రమ మైనింగ్‌పై గురజాలకు చెందిన గురువాచారి అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో యరపతినేని సహా 12 మందిపై సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో శ్రీనివాసరావు రాజకీయాలకు దూరమై, పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

మరో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసు మరో కీలక పరిణామం. ఇడిమేపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 58-3లో 2.40 ఎకరాల తన భూమిపై ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి మరొకరికి రిజిస్ట్రేషన్ చేసినట్లు 2017 ఏప్రిల్ 6న వేలూరు రంగారెడ్డి అనే వ్యక్తి సోమిరెడ్డిపై కోర్టుకెక్కారు.

న్యాయస్థానం ఆదేశాల మేరకు సోమిరెడ్డితో పాటు భూమి కొనుగోలు చేసిన మేఘనాథన్, జయంతి, అప్పటి వెంకటాచలం సర్వేయర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత, మాజీ విప్ కూన రవికుమార్‌ను అధికారులను బెదిరించారనే ఆరోపణలపై అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ కార్యకర్తల దరఖాస్తులను పట్టించుకోవాలని ఆయన సరుబుజ్జిలి ఎంపీడీవోతో వాగ్వాదానికి దిగారు.. దీనిపై ఏపీ ఎన్జీవో నేతలు భగ్గుమనడంతో రవికుమార్‌పై కేసు నమోదు చేశారు.

అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోనే గడుపుతున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ ఆయనను అరెస్ట్ చేయాలని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఒత్తిడితోనే కూనను పోలీసులు వేధిస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.

ఇలా ఒకరి తర్వాత ఒకరు తెలుగుదేశం నేతలు కేసుల పాలవ్వడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపణలు వ్యక్తమవుతున్నా.. రానున్న రోజుల మరింత మందిని కేసుల ఉచ్చులోకి వెళతారేమోనని పచ్చ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ప్రాజెక్టుల రివర్స్ టెండరింగ్ మొదలెట్టిన జగన్ సర్కార్ గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన నేతల జాబితాను సిద్ధం చేసి మరికొందరిపై కేసులు నమోదు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. 

సీబీఐ విచారణకు హైకోర్టు ఆర్డర్: అజ్ఞాతంలోకి యరపతినేని

ఫోర్జరీ సంతకాలు.. భూమి విక్రయం: మాజీ మంత్రి సోమిరెడ్డిపై కేసు నమోదు

అజ్ఞాతంలోకి టీడీపీ నేత కూన రవికుమార్: పోలీసుల గాలింపు

కోడెల షోరూంలో తనిఖీలు: అసెంబ్లీ ఫర్నీచర్ రికవరీ

అసెంబ్లీ ఫర్నీచర్ దారి మళ్లింపు: కోడెలపై మరో కేసు

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

Follow Us:
Download App:
  • android
  • ios