గతంలో అల్లు అర్జున్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో మంచి ఆల్బమ్స్ వచ్చాయి. వ్యక్తిగతంగా కూడా దేవి అంటే బన్నీకి చాలా ఇష్టం. ఇద్దరూ స్నేహపూర్వకంగానే మెలుగుతుంటారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్.. దేవిశ్రీప్రసాద్ ని దూరం పెడుతున్నాడని సమాచారం.

దేవి ఈ మధ్య అసలు ఫాంలో లేకపోవడం, తమ సినిమాలన్నింటికీ ఒకేరకమైన పాటలుంటాయనే విమర్శలు ఎక్కువ అవడంతో దేవిశ్రీ ప్రసాద్ పని పట్ల బన్నీకి ఆసక్తి తగ్గినట్లుంది. 'నా పేరు సూర్య' సినిమాకి విశాల్ శేఖర్ తో మ్యూజిక్ చేయించుకున్న బన్నీ.. త్రివిక్రమ్ తో చేస్తోన్న 'అల వైకుంఠపురంలో' సినిమాకి తమన్ ని సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నాడు.

దీని తరువాత రూపొందే 'ఐకాన్' సినిమాకి కూడా అనిరుద్ ని ఫైనల్ చేసుకున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి. ఆ విధంగా చూసుకుంటే బన్నీ ఇప్పట్లో దేవిశ్రీప్రసాద్ తో కలిసి పనిచేసేలా కనిపించడం లేదు. సుకుమార్ తో బన్నీ సినిమా ఉంటుందనే మాటలు వినిపిస్తున్నాయి.

అప్పుడు మాత్రం దేవిశ్రీని పక్కన పెట్టే ఛాన్స్ లేదు. ఎందుకంటే సుకుమార్ సినిమాలకు దేవి మాత్రమే మ్యూజిక్ చేస్తాడు. పైగా సుకుమార్ తో అతడికి మంచి రాపో ఉంది. అయితే ప్రస్తుతానికి సుకుమార్ తో సినిమా ఉందా..? లేదా..? అనేది సందేహంగానే ఉంది.