బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై ట్విట్టర్ సాక్షిగా మండిపడ్డారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి. మీ రాజకీయ జీవితమంతా చౌకబారు విన్యాసాలేనంటూ ఫైరయ్యారు.

రెండు సార్లు రాజ్యసభ సభ్యత్వం, కేంద్ర మంత్రి పదవి కోసం చంద్రబాబుకు ఎంత కప్పం కట్టారో అందరికీ తెలుసునంటూ వ్యాఖ్యానించారు.

మీరు శుద్ధపూసలా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నా.. మీ హృదయం నిండా బాబే ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కోవర్టుగానే బీజేపీలో చేరారని.. మీ ప్రతి చర్యను బీజేపీ అధిష్టానం గమనిస్తోందని విజయసాయి ధ్వజమెత్తారు.