అమరావతి: తనపై తప్పుడు కేసులు పెడతారని ముందే ఊహించినట్టుగా  మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు.

బుధవారం నాడు మాజీ మంత్రి సోమిరెడ్డిపై ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.ఈ విషయమై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వం మారగానే తనను టార్గెట్ చేస్తారని ముందే తెలుసునని ఆయన తెలిపారు.

సివిల్ కేసును కప్పిపుచ్చి ప్రైవేట్ కేసు పెట్టారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  గుర్తు చేశారు.  నలుగురికి  సహాయం చేశామన్నారు. ఆస్తుల కోసం తాను ఏనాడూ కూడ పాకులాడలేదన్నారు. తప్పుడు కేసులకు తాను భయపడేదీ లేదన్నారు. న్యాయస్థానాలపై తనకు గౌరవం ఉందన్నారు. న్యాయ స్థానాలు ఈ కేసులు చూసుకొంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

ఫోర్జరీ సంతకాలు.. భూమి విక్రయం: మాజీ మంత్రి సోమిరెడ్డిపై కేసు నమోదు