చిట్టా విప్పుతా సుజనాకు బొత్స షాక్: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Aug 26, 2019, 6:02 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.
 

సీఎం జగన్, మంత్రి అనిల్ పై నోరు పారేసుకున్న జూ.ఆర్టిస్ట్ అరెస్ట్: నిందితుడు టీడీపీ యాడ్స్ నటుడు

వరదనీటిలో నిలబడి ఒకరైతు వేషంలో నటిస్తూ ఏపీ ప్రభుత్వంపై తన ప్రతాపం చూపించాడు. వరద బాధితులం అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడు. నోటికి ఏది వస్తే అది అన్నట్లుగా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఒకానొక దశలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ను కులం పేరును సైతం ప్రస్తావించారు.  

 

మంత్రి వెల్లంపల్లి ఇంటికి వెళ్లిన ఏపీ సీఎం జగన్

వెల్లంపల్లి శ్రీనివాస్ కు మాతృవియోగం విషయం తెలుసుకున్న ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా వెల్లంపల్లి నివాసానికి వెళ్లారు. మహాలక్ష్మమ్మ మృతదేహానికి పూలమాలలు వేసినివాళులర్పించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు.  

 

జగన్ కు కేంద్రం పిలుపు, హస్తినకు బయలుదేరిన ఏపీ సీఎం: అమిత్ షాతో భేటీ

ఇకపోతే అంతరాష్ట్ర స్థాయీ మండలి సమావేశం అనంతరం సీఎం జగన్ అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. జగన్ నిర్ణయాలతో కేంద్రం విబేధిస్తున్న పలు అంశాలపై చర్చించనున్నారు. పోలవరం రివర్స్ టెండర్, పీపీఏల పున:సమీక్ష, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యల అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

 

రావెల జంపింగ్ ఎఫెక్ట్: జనసేన పార్టీ ఆఫీస్ కి టూలెట్ బోర్డు

రావెల కిషోర్ బాబు బీజేపీలో చేరడంతో ప్రత్తిపాడులో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేసేశారు కార్యకర్తలు. పార్టీ లోగోలు గానీ పార్టీ అధినేత చిత్రాలను గానీ తొలగించకుండానే యజమానికి భవనాన్ని తిరిగి అప్పగించారు. 
 

ఆత్మహత్యలకు సైతం వెనుకాడం :జగన్ సర్కార్ కి అమరావతి రైతుల హెచ్చరిక

రాజధానిపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధానిని తరలిస్తే ఆత్మహత్యలకు కూడా వెనుకాడబోమని రైతులు హెచ్చరించారు. రైతుల ఆందోళనతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సచివాలయానికి వెళ్లే దారిలో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి.
 

మహిళలంటే అంత చులకనా...? చంద్రబాబు, కోడెలపై రోజా తీవ్ర వ్యాఖ్యలు

కారు షెడ్డులో ఉండాలి, ఆడది వంటింట్లో ఉండాలంటూ చేసిన వ్యక్తి స్పీకర్ గా ఉండటం మన దౌర్భాగ్యమన్నారు. చంద్రబాబు అయితే మహిళల పుట్టుకనే నిందిస్తాడని మండిపడ్డారు. కోడలు మగపిల్లాడును కంటానంటే అత్త వద్దంటుందా అంటూ హీనంగా మాట్లాడారని ఆరోపించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ పేరుతో మహిళలను వ్యభిచార కూపంలోకి నెట్టిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కాపాడారని విమర్శించారు. 

 

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

సేవ చేయడం బీజేపీ రక్తంలోనే ఉందన్నారు. రాష్ట్ర ప్రణాళిక బోర్డు రద్దు చేసిన జగన్.. నాలుగు ప్రణాళిక బోర్డులు తయారు చేస్తున్నారని... అందుకే  నాలుగు రాజధానులు చేస్తారని అనుకుంటున్నానంటూ తన నాలుగు  రాజధానుల ప్రకటనపై వివరణ ఇచ్చాడు.

 

పెళ్లిరోజు... భార్యపై ప్రేమ కురిపించిన లోకేష్, అభిమానులు ఫిదా

ఇది చూసిన అభిమానులు వీరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘మీ ఆనందమైన ఈ జీవితం చిరకాలం సుఖ సంతోషాలతో సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.. పెళ్లి రోజు శుభాకాంక్షలు’.. ‘అన్న, వదినకు పెళ్లిరోజు శుభాకాంక్షలు’.. ‘హ్యాపీ వెడ్డింగ్‌ యానివర్సరీ’.. అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. 

 

రీ టెండర్ల ద్వారానే పోలవరం పనులు: పెద్దిరెడ్డి

రీ టెండరింగ్ విధానం ద్వారానే పోలవరం ప్రాజెక్టు పనులను నిర్వహిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. 

 

అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

రాజధాని భూముల విషయంలో ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. మాజీ కేంద్ర మంత్రి సుజనాపై ఆయన  పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 

 

జూ.ఎన్టీఆర్‌ టీడీపీకి అవసరం లేదు: బాలయ్య చిన్నల్లుడు భరత్ సంచలనం

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి అవసరం లేదని బాలకృస్ణ చిన్నల్లుడు భరత్ తేల్చి చెప్పారు. 

 

అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...

అమరావతి తరలింపు విషయంలో బిజెపి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకేటేష్ తాజాగా చేసిన ప్రకటన కూడా తెలుగుదేశం పార్టీ నేతల అభిప్రాయాలను బలపరిచేవిగా ఉన్నాయి. అమరావతి ఎపి రాజధానిగా ఉండకపోవచ్చుననే సంకేతాలు టీజీ వెంకటేష్ ఇచ్చినట్లు భావిస్తున్నారు.

 

కోమటిరెడ్డికి షాక్: పాదయాత్రకు అనుమతి నిరాకరణ

పాదయాత్రకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పోలీసులు అనుమతిని ఇవ్వలేదు. ఇవాళ్టి నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాదయాత్రను చేపట్టాలని భావించారు.

 

తెరపైకి ఓటుకు నోటు కేసు, సిట్టింగ్ జడ్జితో విచారణ..?: హోంమంత్రితో బీసీ నేత భేటీ

ఓటుకు నోటు కేసులో మాజీ సీఎం చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డిల మధ్య జరిగిన సంభాషణలు బట్టబయలైనా నేటికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

కేసీఆర్ ఆగ్రహం: ఈటెల రాజేందర్ మంత్రి పదవికి గండం?

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. రెవిన్యూ అధికారుల బృందానికి రహస్య సమాచారాన్ని లీక్ చేశారని  ఆయనపై అపవాదు ఉంది.దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహనికి గురయ్యే అవకాశం ఉందంటున్నారు.

 

పేదోళ్లకు గూడు లేదు కానీ కేసీఆర్ కు మాత్రం విలాసవంతమైన భవనమా...?: టీ టీడీపీ నేత ఎల్ రమణ

కేసీఆర్ ప్రగతిభవన్ లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆరోపించారు. కానీ పేదవాడు మాత్రం ఉండటానికి ఇళ్లు లేక ఇబ్బందిపడుతున్నారని చెప్పుకొచ్చారు. దివంగత సీఎం ఎన్టీఆర్ పేదలకు పక్కా ఇళ్లు పథకాన్ని ప్రారంభించారని చెప్పుకొచ్చారు.

 

గాలి బెయిల్ స్కామ్ కేసు: షాకింగ్ వివరాలు చెప్పిన నాగమారుతీ శర్మ

సీబీఐ మాజీ జడ్జి నాగమారుతీ శర్మ గాలి బెయిల్ స్కాంలో  సోమవారం నాడు ఏసీబీ కోర్టులో సాక్ష్యంఇచ్చారు. బెయిల్ కోసం తనకు రూ. 40 కోట్లు ఆఫర్ ఇచ్చారని ఆయన కోర్టులో సాక్ష్యం చెప్పారు.

 

అవన్నీ అసత్యాలే, స్పందించొద్దు: ఈటల

కొత్త రెవిన్యూ చట్టానికి సంబంధించిన సమాచారం లీకైన విషయమై పత్రికల్లో వచ్చిన వార్తలపై టీఆర్ఎస్ శ్రేణులు స్పందించకూడదని మంత్రి ఈటల రాజేందర్ కోరారు.

 

తెలంగాణలో టీడీపీ ఎక్కడ అనేవాళ్ల గువ్వపగలాలి : రావుల చంద్రశేఖర్ రెడ్డి

తెలంగాణలో టీడీపీ కనుమరుగైందంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. తెలుగు ఎక్కడ ఉంటే తెలుగుదేశం పార్టీ అక్కడ ఉంటుందని చెప్పుకొచ్చారు. తెలుగువారు బ్రతికి ఉన్నన్ని రోజులు టీడీపీ ఉంటుందని చెప్పుకొచ్చారు. 
 

రాజకీయాల్లోకి స్టార్ హీరో ఎంట్రీ..!

బీజేపీ మిత్రపక్షమైన ఆర్.ఎస్.పీ లో సంజయ్ దత్ చేరబోతున్నట్లు శివాజీపార్క్ లో జరిగిన ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో జంకర్ వెల్లడించారు. సంజయ్ దత్ ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారని.. ఆయన పార్టీలో చేరతారని దత్ వీడియోను కార్యకర్తల సమావేశంలో ప్రదర్శించారు. 

 

శర్వానంద్ డబుల్ డిజాస్టర్స్.. కోలుకోలేని దెబ్బ

యువ హీరో శర్వానంద్ కెరీర్ మొదటి నుంచి డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక డిఫరెంట్ బ్రాండ్ నేమ్ సెట్ చేసుకున్నాడు. అయితే కెరీర్ లో చాలా రోజుల తరువాత ఈ యువ హీరో బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్ ని ఎదుర్కొన్నాడు. అది కూడా భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 

 

సమ్మర్ బిగ్ ఫైట్.. అజిత్ vs విజయ్

కోలీవుడ్ లో స్టార్ హీరోల లిస్ట్ పెద్దగానే ఉంది. ఎప్పటికప్పుడు బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలుకొట్టే స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. ఇక కమర్షియల్ గా రజినీకాంత్ అనంతరం ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు అజిత్ - విజయ్. అభిమానులు ముద్దుగా వీరిని థలా - ఇలయథలపతి అని పిలుచుకుంటారు. 

 

ప్రియుడితో ఇలియానా బ్రేకప్..?

ఆండ్రూతో ఉన్న ఫొటోల్ని ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తొలగించారు. అంతేకాదు ఇద్దరు ఒకర్నొకరు అన్‌ఫాలో అయ్యారు. దీంతో బాలీవుడ్‌లో వీరి బ్రేకప్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. పలు మీడియా ఛానెల్స్ వార్తలను ప్రచురించాయి. 

 

ఇలాంటి సినిమాలు వద్దని ఆయన భార్యకు ఫోన్ చేసి చెప్పా: ప్రభాస్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో ప్రేక్షకులముందుకు రావడానికి ఇక మూడు రోజులే మిగిలుంది. దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో ఈ చిత్రంపై ఉత్కంఠ నెలకొని ఉంది. సుజీత్ దర్శకత్వంలో, యువి క్రియేషన్స్ బ్యానర్ లో సాహో చిత్రాన్ని దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటించింది. 

 

సీరియల్ నటిని వేధించిన పెట్రోల్ పంప్ యాజమాన్యం!

ప్రముఖ బెంగాలీ టీవీ నటి జుహీ సేన్ గుప్తాను కోల్ కత్తాలో పెట్రోల్ పంప్ యాజమాన్యం వేధింపులకు గురి చేసింది. విషయం పెద్దది కావడంతో పోలీసులు ఈ గొడవలో ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోంది. 

 

ఫ్యాన్స్ కి షాకిచ్చిన సల్మాన్

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ధీరుడు సల్మాన్ ఖాన్ ఇటీవల భారత్ సినిమాతో మొత్తానికి సక్సెస్ అందుకున్నాడు. అనుకున్నట్టుగానే ఈద్ సందర్బంగా సెంటిమెంట్ తో సక్సెస్ కొట్టాడు. అయితే నెక్స్ట్ రంజాన్ కి ఈ స్టార్ హీరో సినిమా ఉండదనే రూమర్స్ ఇటీవల ఆడియెన్స్ లో ఆందోళన కలిగించాయి. 

 

ప్రభాస్ మల్టీప్లెక్స్ ఓపెనింగ్.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..?

ప్ర‌భాస్ సొంత సంస్థ‌ యూవీ క్రియేష‌న్స్ సూలూరు పేట‌లో ఓ మ‌ల్టీప్లెక్స్‌ని నిర్మించింది. దానికి వీ – ఎపిక్ అనే పేరు పెట్టారు. ఈనెల 29న ఈ మ‌ల్టీప్లెక్స్‌ని ప్రారంభించ‌నున్నారు. 30 నుంచి ఈ థియేట‌ర్లో సాహో ప్ర‌ద‌ర్శిస్తారు. 
 

పోలీస్ జీపు పంపిస్తేనే షూటింగ్.. బాలయ్య కండిషన్ పెట్టారట!

నందమూరి బాలకృష్ణ, సీనియర్ దర్శకుడు బి గోపాల్ లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు, లారీ డ్రైవర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో బి గోపాల్ మాట్లాడుతూ తాను దర్శకత్వం వహించిన బాలయ్య చిత్రాలలో రౌండు ఇన్స్పెక్టర్ చాలా ఇష్టం అని బి గోపాల్ తెలిపారు. 

 

సుకుమార్ ఇలా చేస్తాడని బన్ని ఊహించలేదట

సినిమా స్టోరీ లైన్ ఓకే చేసాక , దాన్ని ట్రీట్మెంట్ మార్చేటప్పుడు రకరకాల మార్పులు జరుగుతాయి. స్టోరీ లైన్ గా ఎగ్జైట్ అయ్యిన ఎలిమెంట్స్ ...సినిమా స్క్రిప్టు మొత్తం విన్నాక కనిపించకపోవచ్చు. ఆ ఎగ్జైట్మెంట్ ఎలిమెంట్ మిగతా కమర్షియల్ ఎలిమెంట్స్ లో కలిసిపోయి  కిక్ ఇవ్వకపోవచ్చు. దాంతో తిరిగి మళ్లీ మొదట ఓకే చేసిన లైన్ ఎలివేట్ అయ్యేలా స్క్రిప్టు తిరగరాయాలా, లేక ఎడ్జస్టై ముందుకు వెళ్లిపోవాల్సిందేనా అనేది ప్రతీసారి హీరోలకు ఎదురయ్యే ప్రశ్న. 

 

click me!