హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంది అనే వాళ్లు ఇందిరా పార్క్ వచ్చి చూస్తే తెలుస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లుపై  తెలుగుదేశం పార్టీ ఇందిరాపార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది.

ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగైందంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. తెలుగు ఎక్కడ ఉంటే తెలుగుదేశం పార్టీ అక్కడ ఉంటుందని చెప్పుకొచ్చారు. తెలుగువారు బ్రతికి ఉన్నన్ని రోజులు టీడీపీ ఉంటుందని చెప్పుకొచ్చారు. 

రెండు లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభిస్తే ఇప్పటి వరకు పూర్తి అయినవి కేవలం 9వేలు మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఇంకా 22లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కావాలని వాటిని ఇంకెప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.  

టీఆరెస్ నేతలు టీడీపీ నేతలను కొనుగోలు చేసేందుకు మాత్రమే దృష్టి పెట్టారని విమర్శించారు. పాలనపై మాత్రం దృష్టి పెట్టడం లేదని తిట్టిపోశారు. ప్రగతి భవన్, ఫాంహౌస్ కి కాంట్రాక్టర్లు దొరుకుతారు కానీ పేదల ఇళ్ల కోసం మాత్రం కాంట్రాక్టర్లు దొరకడం లేదా అని నిలదీశారు. 

అతిథుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పేదల ఇళ్లకు ఖర్చుపెట్టేందుకు లక్షలు మాత్రం ఉండవా అని ప్రశ్నించారు. ప్రతీపేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు దక్కే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం ఆగదని హెచ్చరించారు రావుల చంద్రశేఖర్ రెడ్డి. 

ఈ వార్తలు కూడా చదవండి

ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే: క్లారిటీ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే

పేదోళ్లకు గూడు లేదు కానీ కేసీఆర్ కు మాత్రం విలాసవంతమైన భవనమా...?: టీ టీడీపీ నేత ఎల్ రమణ