ప్రభాస్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన యువి క్రియేషన్స్ వారితో కలిసి ఓ థియేటర్ ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 30 న సాహో సినిమాతో ఈ థియేటర్ ని లాంచ్ చేయనున్నారు. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరు పేటలో 'వి ఎపిక్' పేరుతో ఈ  మల్టీప్లెక్స్ ని నిర్మించారు.

సౌత్ ఏషియాలోనే ఇంత పెద్ద స్క్రీన్ ఉన్న థియేటర్ లేదట. అలాగే లేటెస్ట్ డాల్బీ ఆట్మస్ సౌండ్ ఎక్విప్మెంట్ తో ఉంది. ఈ మ‌ల్టీప్లెక్స్ కోసం దాదాపు 60 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ మ‌ల్టీప్లెక్స్‌లో మొత్తం మూడు స్క్రీన్‌లున్నాయి. స్క్రీన్ 1, స్క్రీన్ 2 లు 375 సిట్టింగ్ కెపాసిటీతో నిర్మించారు. స్క్రీన్ 3 మాత్రం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌బోతోంది.

దీని సిట్టింగ్ కెపాసిటీ 750. స్క్రీన్ ఎత్తు దాదాపు 100 అడుగులు. ప్రభాస్ ఫ్యాన్స్ .. సాహోని ఈ థియేటర్ లో చూడాలని ఉత్సాహపడుతున్నారు. మరి ఈ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కి ఎవరు రాబోతున్నారనే విషయంలో ప్రభాస్ పెద నాన్న , నటుడు కృష్ణరాజు, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుల పేర్లు వినిపించాయి. 

తాజా సమాచారం ప్రకారం.. ఈ థియేటర్ లాంచ్ కోసం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నెల్లూరుకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. 29న రామ్‌చ‌ర‌ణ్ హెలీకాఫ్ట‌ర్ పై సూలూరు పేట వెళ్ల‌నున్నార‌ని, చ‌ర‌ణ్ ఈ మ‌ల్టీప్లెక్స్‌కి రిబ్బ‌న్ క‌టింగ్ చేయ‌నున్నార‌ని స‌న్నిహిత వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.