Asianet News TeluguAsianet News Telugu

తెరపైకి ఓటుకు నోటు కేసు, సిట్టింగ్ జడ్జితో విచారణ..?: హోంమంత్రితో బీసీ నేత భేటీ

ఓటుకు నోటు కేసులో మాజీ సీఎం చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డిల మధ్య జరిగిన సంభాషణలు బట్టబయలైనా నేటికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

telangana bc leader yerra satyanarayana demands sitting judge inquiry on vote for cash, nayeem cases
Author
Hyderabad, First Published Aug 26, 2019, 7:39 AM IST

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఓటుకు నోటు ఘటన చోటు చేసుకుని సుమారు ఐదేళ్లు దాటుతున్నా విచారణలో ఎలాంటి పురోగతి లేదంటూ ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. 

ఓటుకు నోటు కేసుతోపాటు నయీం కేసులను సిట్టింగ్ జడ్జితో ప్రత్యేక విచారణ జరిపించాలని తెలంగాణ బీసీ సంక్షఏమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ తెలంగాణ హోం శాఖ మంత్రి మహూద్ అలీని కోరారు. 

సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషులపై చర్యలు తీసుకోవాలంటూ వినతిపత్రం సమర్పించారు. ఓటుకు నోటు కేసులో మాజీ సీఎం చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డిల మధ్య జరిగిన సంభాషణలు బట్టబయలైనా నేటికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఓటుకు నోటు కేసుతోపాటు నయీం కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు వెల్లడించి 5 సంవత్సరాలు దాటినా ఎలాంటి పురోగతి లేదని వినతిపత్రంలో స్పష్టం చేశారు. నయీం ఎన్‌కౌంటర్‌ అయిన తర్వాత వేలాది కోట్ల ఆస్తుల అంశంపై నాలుగేళ్లుగా ఎలాంటి పరిష్కార చర్యలు తీసుకోలేదని సూచించారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పదించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎర్ర సత్యనారాయణ కోరారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికారు, సిగ్గులేకుండా ఎమ్మెల్యేలను కొన్నారు: బాబుపై జగన్

ఓటుకు నోటు కేసు: ఈడీ ఎదుట హాజరైన రేవంత్ రెడ్డి

ఓటుకు నోటు కేసు: డబ్బులు తెచ్చిన బ్యాగ్ ఎక్కడిది, ఎవరిచ్చారు..?

ఓటుకు నోటు కేసు ఎత్తి బాబుపై రవీంద్ర బాబు తీవ్ర వ్యాఖ్యలు

Follow Us:
Download App:
  • android
  • ios