విశాఖపట్టణం: టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ అభిప్రాయపడ్డారు.

 ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు..జూనియర్ ఎన్టీఆర్ మంచి నటుడు, మంచి వక్త అని ఆయన చెప్పారు. కానీ, పార్టీలో చేరాలని  జూనియర్ ఎన్టీఆర్ కోరుకోవాలి.. జూనియర్ ఎన్టీఆర్ ను చేర్చుకోవాలని పార్టీ నాయకత్వం కూడ భావిస్తేనే ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. పార్టీలో చాలా మంది నేతలు ఉన్నారని.. జూనియర్ ఎన్టీఆర్ అవసరం తమకు లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. 

ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతలు పార్టీకి పనికి రారా అని  ఆయన ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ కు అభిమానుల ఫాలోయింగ్ ఉంది, గొప్ప నటుడు వాటిని తాను కాదనడం లేదన్నారు.కానీ, రాజకీయాల్లోకి రావాలని  జూనియర్ ఎన్టీఆర్ కూడ సంకల్పం ఉండాలి కదా అని ఆయన ప్రశ్నించారు.

టీడీపీలో ఉన్న యువ నేతలు కొత్త ఆలోచనలు చేయగలిగితే ,పార్టీని మరింత బలోపేతం చేసే అవకాశం ఉంటుందని భరత్ అభిప్రాయపడ్డారు. సీనియర్ ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన సమయంలో 30 ఏళ్ల వయస్సులోపుగా ఉన్న వారు 200కు పైగా పార్టీలో చేరి విజయం సాధించారని ఆయన గుర్తు చేశారు.

టైమింగ్, చరిష్మా కూడ రాజకీయాల్లో కలిసివస్తోందన్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడ చరిష్మా ఉన్న నేత ఆయన చెప్పారు. కానీ, ఆ పార్టీ అధికారంలో రాలేదన్నారు. ఆ పార్టీకి కేవలం ఆరు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు.

టీడీపీలో తన లాంటి నేతలు అనేక మంది నేతలు చాలా మంది ఉన్నారు. పార్టీలో తమ లాంటి నేతలకు సరైన అవకాశాలను కల్పిస్తే పార్టీ కోసం బలోపేతం చేసేందుకు పనిచేస్తారని ఆయన చెప్పారు.