యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో ప్రేక్షకులముందుకు రావడానికి ఇక మూడు రోజులే మిగిలుంది. దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో ఈ చిత్రంపై ఉత్కంఠ నెలకొని ఉంది. సుజీత్ దర్శకత్వంలో, యువి క్రియేషన్స్ బ్యానర్ లో సాహో చిత్రాన్ని దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటించింది. 

ఎన్నడూ లేనంతగా ప్రభాస్ సాహో చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. అన్ని భాషల్లో సాహో చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. తాజాగా ప్రభాస్ ఓ మాట్లాడుతూ సాహో చిత్ర బడ్జెట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ చిత్రాలు చేయకూడదనుకున్నా. బాహుబలి రిలీజ్ సమయంలో చాలా టెన్షన్ ఉండేది. 

ఆ సమయంలో నిర్మాత శోభు యార్లగడ్డ భార్యకు ఫోన్ చేసి చెప్పా. మీ ఆయన్ని ఇకపై ఇంత భారీ బడ్జెట్ లో సినిమాలు తీయనీకండి. అనవసరమైన టెన్షన్ అని చెప్పా. అలాంటిది తానే తన స్నేహితులతో 300 కోట్లకు పైగా బడ్జెట్ లో సాహో చిత్రాన్ని చేశానని ప్రభాస్ తెలిపాడు. మొదట్లో అందరి ఆడియన్స్ కు ఈ సినిమా రీచ్ అయితే చాలనుకున్నాం. కానీ క్రమంగా బడ్జెట్ పెరిగిపోయింది. 

సాహో నిర్మాతలు నా స్నేహితులే. వాళ్ళది ఒకరకమైన టెన్షన్. సాహో రిజల్ట్ పై వారు టెన్షన్ తో ఉన్నారు. ఇకవేళ రిజల్ట్ అనుకున్న విధంగా రాకుంటే.. ప్రభాస్ ప్రెండ్స్ అయి ఉండి కూడా సరిగా తీయలేదు.. చెడగొట్టారు అని ఫ్యాన్స్ మమ్మల్ని తిడుతారు అని సాహో నిర్మాతలు టెన్షన్ లో ఉన్నట్లు ప్రభాస్ తెలిపాడు. ఇక ప్రమోద్, వంశీ నా బెస్ట్ ప్రెండ్స్ కాబట్టి నాక్కూడా టెన్షన్ ఉందని ప్రభాస్ తెలిపాడు.