నందమూరి బాలకృష్ణ, సీనియర్ దర్శకుడు బి గోపాల్ లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు, లారీ డ్రైవర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో బి గోపాల్ మాట్లాడుతూ తాను దర్శకత్వం వహించిన బాలయ్య చిత్రాలలో రౌండు ఇన్స్పెక్టర్ చాలా ఇష్టం అని బి గోపాల్ తెలిపారు. 

ఈ చిత్రంలో బాలయ్య పోలీస్ ఆఫీసర్. ఆ పాత్రలో బాలయ్య ఒదిగిపోయి నటించారు. పోలీస్ అధికారి పాత్రలో లీనమయ్యేందుకు పోలీస్ జీపులోనే షూటింగ్ కు వచ్చేవారు. ప్రతి రోజు ఇంటికి పోలీస్ జీపు పంపించాలి. లేకుంటే షూటింగ్ కి రాను అని బాలయ్య కండిషన్ పెట్టినట్లు బి గోపాల్ గుర్తు చేసుకున్నారు. 

డైలాగ్ డెలివరీ నుంచి, పోలీస్ ఆఫీసర్ నడక ఇలా ప్రతి విషయంలో బాలయ్య ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేసిన చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్ అని బి గోపాల్ తెలిపారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన విజయశాంతి హీరోయిన్ గా నటించింది. రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం 1992లో విడుదలయింది.