యువ హీరో శర్వానంద్ కెరీర్ మొదటి నుంచి డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక డిఫరెంట్ బ్రాండ్ నేమ్ సెట్ చేసుకున్నాడు. అయితే కెరీర్ లో చాలా రోజుల తరువాత ఈ యువ హీరో బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్ ని ఎదుర్కొన్నాడు. అది కూడా భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 

శర్వా నుంచి గత ఏడాది వచ్చిన పడి పడి లేచే మనసు హిట్టవుతుందని భారీగా రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. అయితే ఆ సినిమా ఎవరు ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా దాదాపు 8కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది. ఇక రీసెంట్ గా వచ్చిన రణరంగం కూడా యువ హీరో కెరీర్ పై గట్టి దెబ్బె కొట్టింది. 

విడుదలకు ముందు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజైన నెక్స్ట్ డే నుంచి ఒక్కసారిగా డివైడ్ టాక్ ను అందుకుంది. కలెక్షన్స్ ఏ మాత్రం సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. ఈ సినిమా కూడా దాదాపు 8కోట్ల వరకు నష్టాలను మిగిల్చినట్లు సమాచారం. ఇప్పటికే థియేటర్స్ సంఖ్య తగ్గింది. ఇక ఈ వారం సాహో సినిమా వస్తే సినిమా రణరంగం కథ క్లోజ్ అయినట్టే.