విజయవాడ : రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాతృమూర్తి మహాలక్ష్మమ్మ(73) ఆదివారం మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం చనిపోయారు. 

వెల్లంపల్లి శ్రీనివాస్ కు మాతృవియోగం విషయం తెలుసుకున్న ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా వెల్లంపల్లి నివాసానికి వెళ్లారు. మహాలక్ష్మమ్మ మృతదేహానికి పూలమాలలు వేసినివాళులర్పించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు.