Asianet News TeluguAsianet News Telugu

ఆత్మహత్యలకు సైతం వెనుకాడం :జగన్ సర్కార్ కి అమరావతి రైతుల హెచ్చరిక

రాజధానిపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధానిని తరలిస్తే ఆత్మహత్యలకు కూడా వెనుకాడబోమని రైతులు హెచ్చరించారు. రైతుల ఆందోళనతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సచివాలయానికి వెళ్లే దారిలో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి.
 

amaravathi farmers protest against ys jagan government
Author
Amaravathi, First Published Aug 26, 2019, 11:28 AM IST

అమరాతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలిపోతుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో రాజధాని రైతులు ఆందోళనబాట పట్టారు. రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం వద్ద రైతులు ఆందోళనకు దిగారు.రోడ్డుపై బైఠాయించారు

రాజధానిపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధానిని తరలిస్తే ఆత్మహత్యలకు కూడా వెనుకాడబోమని రైతులు హెచ్చరించారు. రైతుల ఆందోళనతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సచివాలయానికి వెళ్లే దారిలో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి.

ఇకపోతే అమరావతి రైతులు  రాజధాని తరలింపుపై పోరాటానికి సిద్ధమయ్యారు. రాజధాని తరలింపుపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఇప్పటికే వారంతా అలర్ట్ అయ్యారు.  రాజధాని తరలింపును అడ్డుకునేందుకు అన్ని పార్టీల నేతలతో భేటీ అవుతున్నారు. 

తాము చేస్తున్న పోరాటానికి మద్దతు పలకాలని కోరుతున్నారు. ఇప్పటికే ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను సైతం కలిశారు. రాజధాని కోసం తమ పొలాలను త్యాగం చేస్తే తమపై గందరగోళానికి గురవుతున్నట్లు వాపోయారు. 


ఈ వార్తలు కూడా చదవండి

అమరావతిపై రచ్చ:నాలుగు రాజధానుల వెనుక జగన్ వ్యూహమిదేనా?......

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నా చంద్రబాబు ఇల్లే కనబడుతుందా..? మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది: టీడీపీపై సుజానా సెటైర్లు

రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

Follow Us:
Download App:
  • android
  • ios