అవన్నీ అసత్యాలే, స్పందించొద్దు: ఈటల
కొత్త రెవిన్యూ చట్టానికి సంబంధించిన సమాచారం లీకైన విషయమై పత్రికల్లో వచ్చిన వార్తలపై టీఆర్ఎస్ శ్రేణులు స్పందించకూడదని మంత్రి ఈటల రాజేందర్ కోరారు.
హైదరాబాద్: కొన్ని పత్రికల్లో అసత్య వార్తలు వస్తున్నాయని... వాటిపై స్పందించవద్దని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆ పార్టీ శ్రేణులను కోరారు.కొత్త రెవిన్యూ చట్టానికి సంబంధించి కీలకమైన సమాచారాన్ని రెవిన్యూ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి ఈటల రాజేందర్ లీక్ చేశారనే ప్రచారం సాగుతోంది.
ఈ విషయమై కేసీఆర్ ఇంటలిజన్స్ అధికారులతో సమాచారాన్ని తెప్పించుకొన్నారని అంటున్నారు.ఈ విషయమై కేసీఆర్ మంత్రి ఈటల తీరుపై ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది.ఈ తరుణంలో మీడియాలో కూడ వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ రకమైన వార్తలపై స్పందించకూడదని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కోరారు.అసత్యమైన వార్తలు వస్తున్నాయని ఈ విషయమై ఎవరూ కూడ స్పందించవద్దన్నారు. సోషల్ మీడియా వేదికపై కూడ టీఆర్ఎస్ శ్రేణులు ఈ విషయంలో సంయమనం పాటించాలని ఆయన సూచించారు.
సంబంధిత వార్తలు
కేసీఆర్ ఆగ్రహం: ఈటెల రాజేందర్ మంత్రి పదవికి గండం?
కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?