సినిమా స్టోరీ లైన్ ఓకే చేసాక , దాన్ని ట్రీట్మెంట్ మార్చేటప్పుడు రకరకాల మార్పులు జరుగుతాయి. స్టోరీ లైన్ గా ఎగ్జైట్ అయ్యిన ఎలిమెంట్స్ ...సినిమా స్క్రిప్టు మొత్తం విన్నాక కనిపించకపోవచ్చు. ఆ ఎగ్జైట్మెంట్ ఎలిమెంట్ మిగతా కమర్షియల్ ఎలిమెంట్స్ లో కలిసిపోయి  కిక్ ఇవ్వకపోవచ్చు. దాంతో తిరిగి మళ్లీ మొదట ఓకే చేసిన లైన్ ఎలివేట్ అయ్యేలా స్క్రిప్టు తిరగరాయాలా, లేక ఎడ్జస్టై ముందుకు వెళ్లిపోవాల్సిందేనా అనేది ప్రతీసారి హీరోలకు ఎదురయ్యే ప్రశ్న. అందుకే బౌండెడ్ స్క్రిప్టు అని మొత్తుకుంటూంటారు హీరోలు. అయితే చాలా సార్లు స్టార్ డైరక్టర్స్ తో అది సాధ్యం కాదు. 

వాళ్లు స్క్రిప్టు ఎలా ఉన్నా తెరపై మ్యాజిక్ చేసేస్తారనే ధైర్యంతో హీరోలు ముందుకు వెళ్లిపోతూంటారు. అయితే అల్లు అర్జున్ మాత్రం స్క్రిప్టుకే ప్రయారిటీ ఇస్తారు. మొదట తాను ఎగ్జైట్ అవ్వనిదే తెరకెక్కదు. సుకుమార్ కు కూడా అదే క్లియర్ గా చెప్పాట. సుకుమార్ ఆ మధ్యన చెప్పి ఒప్పించిన స్టోరీ లైన్ ని డవలప్ చేసి రీసెంట్ గా స్క్రిప్టు వినిపించాడట. అయితే స్టోరీ లైన్ గా అద్బుతం అనిపించింది..స్క్రిప్టు పూర్తిగా వినేసరికి అనిపించలేదని బన్ని చెప్పారట. దాంతో మళ్లీ మేజర్ ఛేంజెస్ తో స్క్రిప్టు రెడీ చేయమన్నారట.

సుకుమార్ గత కొద్ది రోజులుగా రాత్రింబవళ్లూ అదే పనిలో ఉన్నారట. అల్లు అర్జున్ సైతం ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లాలా లేక కొద్ది రోజులు ఆలస్యం చేయాలా అనే డైలమోలో ఉన్నారట. సుకుమార్ మాత్రం ఇంత టెన్షన్ లోనూ మెల్లిగా వర్క్ చేస్తున్నారని, అది బన్నికి కోపం తెప్పిస్తోందని చెప్తున్నారు. ఇప్పటికే తాను వక్కంతం వంశీ తో చేసిన నా పేరు సూర్య తర్వాత ఏడాదిన్నర ఖాళీగా ఉన్నానని, ఇంక లేటు చేసే ఆలోచన లేదని క్లియర్ గా చెప్పారట. కంగారు పడితే అవుట్ ఫుట్ అద్బుతంగా రాదని సుకుమార్ ...మళ్లీ మళ్లీ స్క్రిప్టుని తిరగరాసే పనిలో ఉన్నారట.