కోలీవుడ్ లో స్టార్ హీరోల లిస్ట్ పెద్దగానే ఉంది. ఎప్పటికప్పుడు బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలుకొట్టే స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. ఇక కమర్షియల్ గా రజినీకాంత్ అనంతరం ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు అజిత్ - విజయ్. అభిమానులు ముద్దుగా వీరిని థలా - ఇలయథలపతి అని పిలుచుకుంటారు. 

అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు క్లాష్ అయితే అభిమానుల మధ్య క్లాష్ డోస్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. సోషల్ మీడియాలో పోటాపోటీగా ఇప్పటికే మాటల యుద్ధం మొదలైంది. అజిత్ నెక్స్ట్ బోణి కపూర్ ప్రొడక్షన్ లో వినోత్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది.

అదే విధంగా ఇలయథలపతి విజయ్ యువ దర్శకుడు లోకేష్ కనగరాజన్ స్క్రిప్ట్ ను ఇటీవల ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమా కూడా సమ్మర్ లోనే రిలీజ్ కానుంది. దాదాపు ఏప్రిల్ లోనే రెండు సినిమాల మధ్య యుద్ధం మొదలయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.