లొంగిపోయిన రాపాక : మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Aug 13, 2019, 5:54 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

బాబు పంపిన కాపు రిజర్వేషన్ బిల్లును ఆమోదించండి: మోడీకి ముద్రగడ లేఖ

ప్రధాని నరేంద్రమోడీకి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. 2.12.2017న కాపులకు బి. సి రిజర్వేషన్ ‘ఎఫ్’ కేటగిరీలో 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. 

 

నెల్లూరులో టీడీపీ నేత ఇంటిని కూల్చివేసిన అధికారులు, ఉద్రిక్తత

తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించిన కొద్దిరోజుల్లోనే నెల్లూరు టీడీపీ నేత ఇంటిని అధికారులు కూల్చేవేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

 

జనసేనకు షాక్.. ఎమ్మెల్యే రాపాక అరెస్టుకి రంగం సిద్ధం

కేసు నమోదు చేసిన పోలీసులు ఈ రోజు ఎమ్మెల్యే రాపాకను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ముదస్తుగా రాపాక ముఖ్య అనుచరులను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున రాపాక ఇంటికి చేరుకోవడంతో అక్కడ కూడా ఉద్రిక్త  వాతావరణ నెలకొంది.

 

బిట్ కాయిన్... ఏపీలో రూ.200కోట్ల మోసం..

న్యూ ఢిల్లీకి చెందిన చిత్తరంజన్ షా తాను మోసపోయిన విషయాన్ని ముందుకు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అతని ఫిర్యాదు మేరకు ఆర్వోసీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. వారి ప్రాథమిక దర్యాప్తులో  వార్షిక నివేదికలు, బ్యాలెన్స్ షీట్లను ఇవ్వలేదని కనుగొన్నారు. దీంతో.. ఆర్వోసీ నోటీసులు జారీ చేయగా... వాటికి కూడా కంపెనీ సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది.

 

ప్రజలు తిరగబడితే వైసీపీ నిలువదు: చంద్రబాబు

టీడీపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో వైఎస్ఆర్‌సీపీపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్రఅగ్నిగుండం అవుతోందని ఆయన హెచ్చరించారు. 

 

పార్టీలో సమూల మార్పులకు చంద్రబాబు శ్రీకారం

పార్టీలో మార్పులకు చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టనున్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకొంటూ వచ్చే ఎన్నికలకు పార్టీని సన్నధ్దం చేస్తున్నారు. 

 

ఎమ్మెల్యే రాపాకపై పోలీస్ కేసు... స్పందించిన డీఐజీ

సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ మాట్లాడిన వీడియో ఆధారంగా, పోలీస్ స్టేషన్  ముట్టడి ఘటనపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.

 

పోలీసులకు లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే రాపాక

తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్ పై దాడి ఘటనలో ఎమ్మెల్యే పై 3 రోజుల కిందట కేసు నమోదైంది. ఓ గొడవ విషయంలో ఎస్ఐ రామారావు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ... ఆయనను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే రాపాకతోపాటు.. జనసేన కార్యకర్తలంతా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. 

 

చంద్రబాబు భేటీకి కేశినేని, గంటా సహా సీనియర్ల డుమ్మా, కారణం...?

కీలకమైన సమావేశానికి టీడీపీ సీనియర్లు దూరమయ్యారు. సీనియర్లు ఈ సమావేశానికి దూరంగా ఉండడం పట్ల సర్వత్రా చర్చ సాగుతోంది. 

 

జగన్ నేను కొత్తచరిత్ర సృష్టించబోతున్నామన్న కేసీఆర్: కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు

గోదావరి జలాల విషయంలో జగన్, కేసీఆర్ ల వైఖరిని తప్పుబట్టారు.  గోదావరి జలాలను మన భూభాగం నుంచే తీసుకెళ్లే ప్రాజెక్టులకు ఆలోచనలు చేయాలని హితవు పలికారు. 450 కిలోమీటర్లు నీటిని తీసుకుపోవడం సెంటిమెంట్ కు సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. 

 

నిన్న పోలవరం, నేడు పురుషోత్తపట్నం: జగన్ సర్కార్ పై కేంద్రం ఆంక్షలు

పర్యావరణ అనుమతులు లేకుండా ఏపీలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలను ఆపాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం, పురుషోత్తపట్నం- చింతలపూడి ఎత్తిపోతల పథకాలను ఆపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే ఆ ప్రాజెక్టుల పనులు కొనసాగించాలని సూచించింది. 

 

ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే: తేల్చిచెప్పిన మంత్రి కొడాలి నాని ప్రత్యర్థి

ప్రజాసేవ చేయడానికి పదవులు అక్కర్లేదని, చిత్తశుద్ధి ఉంటే చాలునని చెప్పుకొచ్చారు. పదవులకు ఆశపడి తాను తెలుగుదేశం పార్టీలో చేరలేదని చంద్రబాబు నిర్ణయాలు నచ్చే టీడీపీలో చేరానని తెలిపారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానే తప్ప స్వార్థ ప్రయోజనాల కోసం కాదన్నారు. 

 

ఎమ్మెల్యే రాపాక అరెస్ట్: పోలీసులపై కోర్టు సీరియస్

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ బెయిల్ పై విడుదలయ్యారు. రాపాకపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడంపై కోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

నామినేటేడ్ పోస్టుల భర్తీకి కేసీఆర్ ప్లాన్: నేతల భయమిదీ....

నామినేటేడ్ పోస్టులను భర్తీ చేసేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ పోస్టులు ఎవరికి దక్కుతాయనే విషయమై నేతల్లో ఆందోళన నెలకొంది.

 

అతడు సినిమా ఇన్సిపిరేషనేమో: ఒక్క ఆటోలో 24 మందిని కుక్కాడు

ఒక్క ఆటోలో ఎంతమంది పడతారు 10 మంది ఆటోవాలా మరీ కక్కుర్తిపడితే 15 మంది. అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 24 మందిని కుక్కాడు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఆటోడ్రైవర్ తన వాహనంలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని తిమ్మాపూర్‌ వెళ్తూ పోలీసులకు చిక్కాడు.

 

క్యాబ్ డ్రైవర్ మంచితనం: ప్రయాణికురాలి బ్యాగ్‌ పోలీసులకు అప్పగింత

రోడ్డు మీద పది రూపాయలు కనబడతానే ఎవరు చూడకుండా చటుక్కున జేబులో వేసేసుకుంటాం.  అలాంటిది బంగారు చైన్,  30 సవర్ల వెండి పట్టీలు, రెండు వేల రూపాయల నగదు కనిపించినప్పటికీ ఏమాత్రం కక్కుర్తిపడకుండా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడో ఓలా క్యాబ్ డ్రైవర్

 

దర్శకుడు విశ్వనాథ్ తో భేటీ: కేసీఆర్ రాజకీయం ఇదే...

కళాతపస్వి కే విశ్వనాధ్ - పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. కేవలం తెలుగు చలనచిత్రరంగంలోనే కాకుండా ఇటు తమిళ, కన్నడ, హిందీ వంటి పలు భాషల్లో సినిమాలు తీశారు. పలు నేషనల్ అవార్డులు అందుకున్నారు.

 

స్మితా సబర్వాల్ బేఖాతర్: కేసీఆర్‌కు జోషికి మధ్య అగాధం

 తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి మధ్య అగాధం పెరుగుతోంది.అవసరమైతే తాను ఇంటి వద్ద నుండే కార్యక్రమాలను నిర్వహిస్తానని జోషి తన కార్యాలయ వర్గాలకు చెప్పినట్టుగా ప్రచారం సాగుతోంది.

 

ఆ సినిమాకి దాదాపు హార్ట్ ఎటాక్ వచ్చింది: ప్రభాస్

సాహో ప్రమోషన్స్ లో భాగంగా తన బలహీనతల్ని బయటపెట్టాడు ప్రభాస్. తనకు మొహమాటం, బద్ధకం ఎక్కువని.. వాటితో పాటు జనాల్లో కలవడానికి కూడా చాలా ఇబ్బంది పడతానని ఒప్పుకున్నాడు
 

'సాహో' యుఎస్ ప్రీమియర్ షో కాన్సిల్ ? కారణం


ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ సాహో. ఈ చిత్రం యుఎస్ లోనూ భారీగానే విడుదల అవుతోంది. ప్రభాస్ కు అక్కడ బాగా మార్కెట్ ఉండటంతో మంచి రేట్ కే అమ్మకాలు జరిగాయి. దాంతో ప్రభాస్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా ప్రీమియర్ షో ని భారీగా ప్లాన్ చేసారు. 
 

 

నటి రహస్య వివాహం.. రూ.4 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోన్న మాజీ ప్రియుడు!

బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌ రహస్యంగా వివాహం చేసుకోవడంపై ఆమె మాజీ ప్రియుడు దీపక్‌ ఖలాల్‌ షాక్‌ అయ్యారు. దీపక్‌తో తన వివాహం జరగనుందని కొన్ని నెలల క్రితం రాఖీ ప్రకటించారు. ఆ తర్వాత ఆయన్ను వివాహం చేసుకోవడం లేదని సోషల్‌మీడియాలో పేర్కొన్నారు.

 

'అర్జున్ రెడ్డి' స్టైల్ లో నా పిల్లల్ని పెంచుతా.. అనసూయ కామెంట్స్!

నటిగా, యాంకర్‌గా దూసుకుపోతున్న అనసూయ అంటే అందరూ ఇష్టపడతారు కానీ.. ఆమె వేసుకునే దుస్తులపైనే ట్రోలింగ్ చేస్తుంటారు. 
 

'RRR'.. ఎన్టీఆర్ లుక్ ఇప్పట్లో రిలీజ్ చేయరట!

ఆగస్ట్ 15న ఎన్టీఆర్ గెటప్ రివీల్ చేయడం లేదని తెలుస్తోంది. చిత్రబృందానికి సంబంధించిన కీలకవ్యక్తి ఈ విషయాన్ని వెల్లడించారు. అసలు 'RRR' టీమ్ ఇప్పట్లో ఎన్టీఆర్ గెటప్ రివీల్ చేసే ఆలోచనే లేదని చెప్పారు. 

 

వైరల్ అవుతోన్న మహేష్ కూతురు డాన్స్ వీడియో..!

తాజాగా సితార 'మహర్షి' సినిమాలో పాలపిట్ట అనే పాటకు డాన్స్ చేసింది. ఈ వీడియో కూడా నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన ముద్దుల కూతురు డాన్స్ చూసి మురిసిపోయిన నమ్రత.. 'నువ్ ఎంత చక్కగా ఉన్నవో.. ప్రతీరోజు నేను సంతోషంతో నవ్వడానికి నువ్ కారనమవుతున్నావు' అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది. 

 

సంపూర్ణేష్ బాబు అంటే ఇది.. వరద బాధితులకు సాయం ఎంతో తెలుసా!

సంపూర్ణేష్ బాబు హృదయ కాలేయం చిత్రంతో కామెడీ హీరోగా మారాడు. ఒకప్పుడు సంపూర్ణేష్ బాబుపై కామెడీ స్పూఫ్ లు చేసే హీరో అంటూ సెటైర్లు పడ్డాయి. కానీ ఇప్పుడు సంపూర్ణేష్ నటించిన సినిమాలు చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. సంపూర్ణేష్ బాబు బర్నింగ్ స్టార్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. 

 

చిన్న పొరపాటు జరిగినా ఘోరమే.. రిస్క్ లో హీరోల ప్రాణాలు!

యాక్షన్ చిత్రాల్లో రిస్క్ తో కూడుకున్న సన్నివేశాలు కొన్ని ఉంటాయి. అలాంటి సన్నివేశాలకు ఎక్కువగా బాడీ డబుల్స్ ని ఉపయోగిస్తుంటారు. కానీ కొందరు హీరోలు మాత్రం స్టంట్ సీన్స్ స్వయంగా చేసేందుకు ఇష్టపడతారు. అలాంటి వారిలో అక్షయ్ కుమార్, హృతిక్, టైగర్ ష్రాఫ్ లాంటి హీరోలు ముందువరుసలో ఉంటారు. 

 

 

 

 

click me!