యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ సాహో. అంతర్జాతీయ స్థాయి యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్‌ అవుతున్న  ఈ చిత్రం యుఎస్ లోనూ భారీగానే విడుదల అవుతోంది. ప్రభాస్ కు అక్కడ బాగా మార్కెట్ ఉండటంతో మంచి రేట్ కే అమ్మకాలు జరిగాయి. దాంతో ప్రభాస్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా ప్రీమియర్ షో ని భారీగా ప్లాన్ చేసారు.

అయితే కొన్ని బయటకు రాని  కారణాలు వల్ల సాహో యూఎస్ ప్రీమియర్ షోస్ ను క్యాన్సల్ చేశారట మేకర్స్.  విషయం ఏంటో తెలియదు కానీ ముందు నుంచీ ప్లాన్ చేసుకున్న డిస్ట్రిబ్యూటర్లు ప్రస్తుతం ఏమి అర్ధంకాని సిట్యువేషన్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ప్రీమియర్ షో వేస్తే టాక్ ముందే బయిటకు వచ్చేస్తుంది. అలా టాక్ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్తున్నారు. అన్ని చోట్ల నుంచీ ఒకేసారి టాక్ బయటకి వస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఈ డెసిషన్ తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. 

మరో ప్రక్క ఈసినిమా రైట్స్ ఎవరు ఊహించని విధంగా భారీ మొత్తంలో డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేయటంతో వాళ్లు సూప్ లో పడినట్లు అయ్యింది. ప్రీమియర్స్ ద్వారా ఎంతో కొంత రికవరీ ఉంటుందని భావించారు. కానీ ఇలా లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇస్తారని ఊహించలేదంటున్నారు. 

ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్‌ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మందిరా బేడీ, జాకీ ష్రాఫ్‌, చుంకీ పాండే, అరుణ్‌ విజయ్‌లు కీలక పాత్రల్లో నటించారు.