దర్శకుడు విశ్వనాథ్ తో భేటీ: కేసీఆర్ రాజకీయం ఇదే...

First Published Aug 13, 2019, 2:58 PM IST

కళాతపస్వి కే విశ్వనాధ్ - పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. కేవలం తెలుగు చలనచిత్రరంగంలోనే కాకుండా ఇటు తమిళ, కన్నడ, హిందీ వంటి పలు భాషల్లో సినిమాలు తీశారు. పలు నేషనల్ అవార్డులు అందుకున్నారు. కమర్షియల్ సినిమాలు మాత్రమే హిట్లు కొడుతాయని భావిస్తున్న కాలంలో సినిమాకు  ఫార్ములా వంటివి ఉండవు కేవలం ప్రేక్షకులను రంజింప చేయగలిగితే చాలని నమ్మి పారలెల్ సినిమాలు తీశారు. కేవలం సినిమాను ఒక వినోద మాధ్యమంగానే కాకుండా సామాజిక సమస్యలపైన పోరాడేందుకు ఒక సాధనంగా ఎంచుకున్నారు. సఫలీకృతులయ్యారు. 

దాదాపు ఒక 10సంవత్సరాల కిందనే సినిమాలు చేయడం మానేసిన విశ్వనాధ్ గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాం, ఆయన పుట్టినరోజు కూడా ఇప్పుడు కాదే అనే సందేహం తలెత్తవచ్చు. కానీ కారణం లేకపోలేదు. ఉన్నట్టుండి పూర్తిగా వేడెక్కి ఉన్న రాజకీయ వాతావరణంలో, మునిసిపల్ ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ, పెద్దగా కారణం లేకపోయినా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ విశ్వనాధ్ ను కలిసి శాలువాతో సత్కరించారు. అక్కడితో ఆగకుండా - విశ్వనాధ్ కనుక ఒక సినిమా తీస్తానంటే తానే స్వయంగా నిర్మిస్తానని చెప్పారు.

ఒక డైరెక్టర్ కాబట్టి కెసిఆర్ ఆలా అనుంటాడు, సహజంగానే కెసిఆర్ కవి అవడం, తెలుగు సాహిత్యం పట్ల కెసిఆర్ కి ఉన్న ఆసక్తి వల్ల ఆలా మాట్లాడి ఉండొచ్చు అని సగటు మనిషికి అనిపించడం సహజం. కానీ, ఇక్కడే ఒకసారి ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలించి వాటికి అన్వయం చేసి చూసుకుంటే, ఒక కొత్త కోణం ఆవిష్కృతమవుతుంది.

విశ్వనాధ్ అల్ టైం క్లాసిక్స్ లో మేటి సినిమా శంకరాభరణం. ఇందులో శంకర శాస్త్రి వేశ్య కూతురిని చేరదీస్తాడు. త్రికాల సంధ్యావందనం చేసే ఒక సద్బ్రాహ్మణుడు కూడా బూజు పట్టిన సంప్రదాయాలను పక్కకు పెట్టి, సర్వామోద విశ్వాసానికి ప్రాధాన్యం ఇవ్వకుండా నైతిక విలువలు ముఖ్యం. మానవత్వమే గొప్ప మతమని చాటి చెప్పాడు. ఇక్కడే ఒక పొలిటికల్ మెసేజ్ ప్రస్తుత పరిస్థితులకు సరిపోయేలా కనపడుతుంది.

బీజేపీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిందుత్వ సిద్ధాంతాలతో మత ప్రాతిపదికన మనుషులను ఏకం చేసే పనిలో నిమగ్నమయి ఉంది. తెలంగాణలో కూడా తమ జెండా పాతేందుకు బీజేపీ తీవ్రస్థాయిలో కృషి చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ తరుణంలోనే మతమనేదొక్కటే ప్రాతిపదిక కాదు, పరిపాలనా దక్షత, మానవత్వం, నైతికత అనేవి చాలా అవసరం అనే సందేశం శంకరాభరణం సినిమాలో ఉంది.

శంకరాభరణం సినిమాలో మరో సన్నివేశంలో పాశ్చాత్య సంగీతాన్ని వాయిస్తున్న యువకులకు శాస్త్రీయ సంగీతం ఔన్నత్యాన్ని తెలిపే ఒక సీన్ సినిమాకే ఆయువు పట్టు వంటిది. మొదట ఆ సంగీతం పట్ల కోపోద్రిక్తుడైన శంకర శాస్త్రిని చూసి మనమంతా ఇప్పుడతను వెళ్లి వారిని తిడుతాడని భావిస్తాము. కానీ దర్శకుడు మాత్రం బయటకెళ్లిన శంకర శాస్త్రితో ఇంగ్లీషులో మాట్లాడించడమే కాకుండా వారి సంగీతాన్ని కూడా అవపోశన పట్టినవాడిగా చూపిస్తాడు. ఇక్కడ శాస్త్రీయ సంగీతం గొప్పతనాన్ని చాలా చక్కగా చూపించారు విశ్వనాధ్. దీన్ని రాజకీయాలకు అన్వయం చేసుకుంటే తెలంగాణ సెంటిమెంటు స్ఫురించక మానదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడో జాతీయ స్థాయి పార్టీ కన్నా తెలంగాణ కోసం పోరాడిన పార్టీ ఎంతో ఉన్నతమైనదనే మెసేజ్ కనపడుతుంది. ఇక్కడి మూలాలను ప్రజలకు గుర్తుచేస్తుంది.

ఇందులోని పతాక సన్నివేశంలో కచేరిలో ఈ కచేరీని ఏర్పాటు చేసి శాస్త్రీయ సంగీతాన్ని కాపాడుతున్నవారికి ధన్యవాదాలు అంటాడు శంకరశాస్త్రి. ఇక్కడే రాజకీయంగా కూడా ఇక్కడ సంస్కృతులను, గంగ యమునా తెహజీబ్ గా పిలుచుకునే హిందూ ముస్లిముల ఐక్యత దాన్ని స్ఫురింపచేస్తుంది.

ఫైనల్ గా కెసిఆర్ ఇక్కడి చరిత్రను ముఖ్యంగా యాదాద్రి అభివృద్ధి, ప్రజల జీవనశైలి,సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబించేలా ఒక సినిమాను తీయమని విశ్వనాధ్ ని అడిగి ఉండొచ్చు. సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్ర మీద సినిమా తీయమని అడిగితే కెసిఆర్ కు ఏం లాభం అనే సందేహం కలుగక మానదు. నూతన రాష్ట్రంలో చరిత్రను గురించి ఏం చెప్పాలన్నా, అందులో కెసిఆర్ అంతర్భాగం.

ఒక రెండు రోజుల కిందట కేటిఆర్ ట్వీట్ ను కనుక మనం తీసుకుంటే, మతాన్ని రాజకీయాన్ని బీజేపీ కలిపేసిందని ఒక పోస్ట్ పెట్టారు. దాని మరుసటి రోజే కెసిఆర్ విశ్వనాధ్ తో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ హిందుత్వ ప్రాతిపాదకన గనుక ఇక్కడ రాజకీయాలు చేస్తే టీఆర్ఎస్ నిలువలేదు. 2023 ఎన్నికల నాటికి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పూర్తిచేసుకొని ఉంటుంది. 2018లో కెసిఆర్ కు మరో అవకాశం ఇద్దామని ఎందరో ప్రజలు ఓట్లు వేశారు. ఈ సారి దానికి ఆస్కారం ఉండదు.

పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు చెప్పుకోదగ్గ స్థాయిలోనే టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఈ విషయం కెసిఆర్ కు తెలియంది కాదు. అందుకే ఒక సినిమా గనుక విశ్వనాధ్ వంటి దర్శకుడితో తెరకెక్కించగలిగితే దాని ప్రభావం ప్రజలపైన ఖచ్చితంగా ఉంటుంది. శంకరాభరణం సినిమా వచ్చిన తరువాత ఒక 30 సంవత్సరాలపాటు తెలుగు ప్రజలు శాస్త్రీయ సంగీతాన్ని ఇతోధికంగా నేర్చుకున్నారు. ఎక్కడో తమిళనాట మాత్రమే బహుళ ప్రాచుర్యంలో ఉండే శాస్త్రీయ సంగీతాన్ని అత్యధికమంది తెలుగు ప్రజల గడప తొక్కించడం కేవలం విశ్వనాధ్ కే సాధ్యపడింది.

ఇంతకుముందు కెసిఆర్ మీద కానీ తెలంగాణా మీద కానీ సినిమాలు రాలేదని కాదు. కాకపోతే ఒక సాధారణ దర్శకుడు చెప్పడం వేరు, విశ్వనాధ్ వంటి కళాతపస్వి చెప్పడం వేరు. తీర్థం అనాలంటే శంఖంలో పోయాల్సిందే కదా!

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?