బీజేపీలో చేరిన 10 మంది ఎస్‌డీఎఫ్ ఎమ్మెల్యేలు

Published : Aug 13, 2019, 05:47 PM IST
బీజేపీలో చేరిన 10 మంది ఎస్‌డీఎఫ్ ఎమ్మెల్యేలు

సారాంశం

ఒక్క స్థానం కూడ లేని సిక్కింలో బీజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఎస్డీఎఫ్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు మంగళవారం నాడు బీజేపీలో చేరారు.

గ్యాంగ్‌టక్: సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ నుండి 10 ఎమ్మెల్యేలు మంగళవారం నాడు బీజేపీలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిసిన ఎమ్మెల్యేలు బీజేపీ తీర్ధం పుచ్చుకొన్నారు.

ఒక్క సీటు కూడ గెలుచుకోని బీజేపీ సిక్కిం రాష్ట్రంలో ఇప్పుడు అతిపెద్ద రెండో పార్టీగా అవతరించింది. ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కిం మినహా ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం ఉంది. సిక్కింలో మాత్రం బీజేపీ ఒక్క సీటును కూడ గెలుచుకోలేదు.

సిక్కిం అసెంబ్లీలో 32 స్థానాలున్నాయి. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ కు 15 స్థానాలు దక్కాయి. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు స్థానాల్లో విజయం సాధించార. దీంతో వారిద్దరూ కూడ ఒక్కో స్థానానికి రాజీనామాలు సమర్పించారు. ఈ రాజీనామాలతో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ బలం 13కు పడిపోయింది.సిక్కిం క్రాంతికారి మోర్చా 17 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

సిక్కిం డెమోక్రటిక్ పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది మంగళవారం నాడు బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు. దీంతో ఆ పార్టీ బలం మూడుకు పడిపోయింది. 
 

PREV
click me!

Recommended Stories

Vijay Election Campaign: రోడ్డుపై సైకిల్ తొక్కిన విజయ్ ఫ్యాన్స్ దూసుకురాగానే షాక్! | Asianet Telugu
Kedarnath Yatra Update: కేదార్ నాథ్ యాత్రకు శరవేగంగా ఏర్పాట్లు| Asianet News Telugu