బాలీవుడ్ నటి రాఖీ సావంత్ రహస్యంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లైన రెండు, మూడు రోజులకు గానీ అమ్మడు విషయాన్ని బయట పెట్టలేదు. అయితే ఈ పెళ్లిపై రాఖీ మాజీ ప్రియుడు దీపక్ ఖలాల్ షాక్ అయ్యారు. దీపక్ తో తన వివాహం జరగనుందని కొన్ని నెలల క్రితం రాఖీ సోషల్ మీడియాలో ప్రకటించింది.

ఆ తరువాత ఆయన్ని పెళ్లి చేసుకోవడం లేదని మరో పోస్ట్ పెట్టింది. కొన్ని రోజుల క్రితం ఈమె ఓ ఎన్నారైను రహస్యంగా వివాహం చేసుకొని షాక్ ఇచ్చింది. దీని తరువాత మీడియాతో మాట్లాడిన ఆమె.. తన భర్త యూకే వెళ్లిపోయారని.. తనకు వీసా రావాల్సివుందని.. ఆ ప్రక్రియ పూర్తయిన తరువాత ఆయన దగ్గరకి వెళ్తానని.. అక్కడే సెటిల్ అవుతామని చెప్పింది.

ఈ క్రమంలో రాఖీ తనను మోసం చేసిందంటూ దీపక్ ఇన్స్టాగ్రామ్ ఓ వీడియోను షేర్ చేశాడు. తనకు నాలుగు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. నాలుగు రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే ఆమె జీవితాన్ని నాశనం చేశానని బెదిరించారు. అయితే దీపక్ వ్యాఖ్యలను ఖండించిన రాఖీ అతడిపై మండిపడింది.

ఈ క్రమంలో ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు తన భర్త గురించి తప్పుగా మాట్లాడడాన్ని భరించలేని రాఖీ.. దీపక్ ఖలాల్ ని తిట్టిపోసింది. మరి ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో..!


 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on Aug 12, 2019 at 12:45am PDT