యాక్షన్ చిత్రాల్లో రిస్క్ తో కూడుకున్న సన్నివేశాలు కొన్ని ఉంటాయి. అలాంటి సన్నివేశాలకు ఎక్కువగా బాడీ డబుల్స్ ని ఉపయోగిస్తుంటారు. కానీ కొందరు హీరోలు మాత్రం స్టంట్ సీన్స్ స్వయంగా చేసేందుకు ఇష్టపడతారు. అలాంటి వారిలో అక్షయ్ కుమార్, హృతిక్, టైగర్ ష్రాఫ్ లాంటి హీరోలు ముందువరుసలో ఉంటారు. 

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'వార్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ హై యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం గురించి ఒక్కొక్కటిగా బయటకొస్తున్న విశేషాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయనున్నారు. 

తాజాగా ఈ చిత్రంలోని ఓ స్టంట్ సీన్ గురించి చిత్ర యూనిట్ ఆసక్తికర విషయాన్ని ప్రకటించింది. ఈ చిత్రంలో హృతిక్, టైగర్ ష్రాఫ్ మధ్య ఛేజింగ్ సన్నివేశాలు కళ్ళు చెదిరే విధంగా ఉండబోతున్నాయట. ప్రేక్షకులకు అత్యంత ఉత్కంఠ రేకెత్తించే విధంగా యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేస్తున్నట్లు దర్శకుడు ప్రకటించారు. ఓ ఛేజింగ్ సన్నివేశంలో భాగంగా హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ బాడీ డబుల్ లేకుండా నటించారట. 

ఇద్దరూ కలసి గ్లాస్ ని బ్రేక్ చేసే సీన్ కి సంబంధించిన దృశ్యాలని చిత్ర యూనిట్ పంచుకుంది. ఆ ఫోటోలు ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉన్నాయి. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ మాట్లాడుతూ.. ఈ సన్నివేశంలో ఏమాత్రం పొరపాటు జరిగినా ఇద్దరు హీరోలు తీవ్రంగా గాయపడేవారు. కానీ ఇద్దరూ పర్ఫెక్ట్ గా చాలా జాగ్రత్తగా చేశారు. ఇది హై రిస్క్ తో కూడుకున్న సన్నివేశం. 

ఈ సీన్ షూటింగ్ కి ముందు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అని డైరెక్టర్ తెలిపాడు. హృతిక్ రోషన్ బైక్ పై స్పీడ్ గా వెళుతుండగా అతడిని టైగర్ ష్రాఫ్ ఛేజ్ చేసే సీన్ అది.