ఆగస్ట్ 15 సందర్భంగా 'RRR'లో ఎన్టీఆర్ లుక్ రాబోతుందని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ప్రముఖ సినీ వెబ్ సైట్లు కూడా ఈ వార్తను ప్రచురించడంతో నిజమని భావించారు. కొమరం భీమ్ పాత్ర స్పూర్తిగా ఎన్టీఆర్ పాత్రను డిజైన్ చేసిన రాజమౌళి ఆ గెటప్ తో ఎన్టీఆర్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నారని వార్త రాగానే ఎన్టీఆర్ అభిమానులు తెగ ఆనందపడిపోయారు.

కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదని సమాచారం. ఆగస్ట్ 15న ఎన్టీఆర్ గెటప్ రివీల్ చేయడం లేదని తెలుస్తోంది. చిత్రబృందానికి సంబంధించిన కీలకవ్యక్తి ఈ విషయాన్ని  వెల్లడించారు. అసలు 'RRR' టీమ్ ఇప్పట్లో ఎన్టీఆర్ గెటప్ రివీల్ చేసే ఆలోచనే లేదని చెప్పారు.

సినిమా రిలీజ్ 2020లో పెట్టుకున్నారు కాబట్టి దానికి తగ్గట్లుగా ప్లాన్ చేసుకుంటున్నారని.. ఆగస్ట్ 15నే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే అది చాలా ఎర్లీ అవుతుందని అసలు అలాంటి ఆలోచనే  లేదని తేల్చిచెప్పారు. నిజానికి ఈ సినిమాకి మార్కెటింగ్ పరంగా వచ్చిన ఢోకా లేదు.

జనాలు పోటీ పడి మరీ కొనుక్కుంటారు. కాబట్టి ఇప్పటినుండే సినిమాను ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చిత్రబృందం కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి  ఈ ఆగస్ట్ 15కి ఎన్టీఆర్ నుండి ఫ్యాన్స్ కి ఎలాంటి సర్ప్రైజ్ లు ఉండవనే విషయం స్పష్టమవుతోంది.