ప్రధాని నరేంద్రమోడీకి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. 2.12.2017న కాపులకు బి. సి రిజర్వేషన్ ‘ఎఫ్’ కేటగిరీలో 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన బిల్లును ఆమోదించాల్సిందిగా ముద్రగడ లేఖలో కోరారు.

‘‘బ్రిటిష్ వారి రాజపత్రం నెం. 67/1915 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మా జాతి (బలిజ, తెలగ, ఒంటరి, కాపు) బి సి రిజర్వేషన్ అనుభవించేది. 

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు 1956లో రిజర్వేషన్ తొలగించడం, అలా తొలగించిన రిజర్వేషన్లను అప్పటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు 1961లో జీఓ నెం. 3250 ద్వారా పునరుద్ధరించడం, ఆఖరిగా మరొక ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు 1964లో ఈ రిజర్వేషన్ రద్దు చేయడం జరిగిందని దస్త్రాలు చెబుతున్నాయని పెద్దల మాట. మా జాతి వారు గతంలో బి. సి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందిన వారు చాలా మంది ఉన్నారండి. 

అప్పటి నుంచి ఎన్నో పార్టీలు వారు పొగొట్టుకున్న మా రిజర్వేషన్లు ఇస్తామని హామీలు ఇవ్వడం మా జాతిని ఓటు బ్యాంకుగా వాడుకుని, ఓట్లు వేయించుకుని, అధికారంలోకి రాగానే మోసం చేస్తూ మొహం చాటేయడం జరుగుతానే ఉందండి.

02.12.2017న మా జాతికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీ.సీ రిజర్వేషన్ ‘ఎఫ్’ కేటగిరీలో 5 శాతం కేటాయిస్తూ తీర్మానం చేసి గౌరవ గవర్నర్ గారి ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి బిల్లు నెం. 33/2017 అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంపియున్నారండి.

దయ చేసి తమరు మా జాతి యందు పెద్ద మనస్సు చేసుకుని పోగొట్టుకున్న బి.సి(ఎఫ్) రిజర్వేషన్ ఫైలును ఆమోదింది మా జాతిలో ఉన్న పేద వారి జీవితాలలో వెలుతురును ఇప్పించమని కోరి ప్రార్ధించుచున్నానని’’ మోడీని లేఖలో కోరారు. 

సంబంధిత వార్తలు

కాపు కోటా: చంద్రబాబుకు వైఎస్ జగన్ కౌంటర్ వ్యూహం

అయ్యా జగన్.. షర్మిలకి జరిగినట్లే, నాకూ జరుగుతోంది: ముద్రగడ

నోటికి ప్లాస్టర్ వేసుకుంటా: జగన్‌కు ముద్రగడ ఘాటు లేఖ

పవన్ ను కాదని మీకు ఓటేశాం: జగన్ కు ముద్రగడ లేఖ

పవన్ కళ్యాణ్ కి ముద్రగడ షాక్

చంద్రబాబుపై ముద్రగడ లేఖాస్త్రం

మోహన్ బాబుతో ముద్రగడ భేటీ.. ఆంతర్యం..?

మీ పతనం తథ్యం.. చంద్రబాబుకి ముద్రగడ లేఖ