MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • National
  • Indian Railway Rules: ఆగస్టు 1 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ ఛేంజ్.. కొత్త టోకెన్ సిస్టమ్ డిటైల్స్ ఇవే

Indian Railway Rules: ఆగస్టు 1 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ ఛేంజ్.. కొత్త టోకెన్ సిస్టమ్ డిటైల్స్ ఇవే

Indian Railway Rules: ఆగస్టు 1 నుంచి రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ నియమాలు మారుతున్నాయి. వెస్ట్ సెంట్రల్ రైల్వే కౌంటర్ల వద్ద కొత్త టోకెన్ సిస్టమ్ అందుబాటులోకి తేనుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 28 2026, 09:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్
Image Credit : Gemini

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్

ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. రైల్వే స్టేషన్ కౌంటర్లలో తత్కాల్ టికెట్లు తీసుకునే వారి కోసం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఆగస్టు 1 నుంచి ఈ కొత్త బుకింగ్ ప్రాసెస్ ప్రారంభం కానుంది. వెస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని రిజర్వేషన్ కౌంటర్లలో ఈ కొత్త టోకెన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. కౌంటర్ల దగ్గర క్యూ లైన్లు తగ్గించడం, ప్రాసెస్‌ను మరింత వేగంగా చేయడం కోసం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కొత్త టోకెన్ టైమింగ్స్ ఇవే
Image Credit : Chatgpt

కొత్త టోకెన్ టైమింగ్స్ ఇవే

ఇప్పటివరకు తత్కాల్ టికెట్ల కోసం కౌంటర్ల దగ్గర ప్రయాణికులు గంటల కొద్దీ నిలబడాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ అవసరం ఉండదు. కొత్త విధానంలో బుకింగ్ సమయానికి ముందే టోకెన్లు ఇస్తారు. ఏసీ తత్కాల్ టికెట్ల కోసం ఉదయం 8:30 గంటల నుంచి 9:00 గంటల వరకు టోకెన్లు జారీ చేస్తారు. స్లీపర్ లేదా నాన్ ఏసీ తత్కాల్ కోసం ఉదయం 9:00 గంటల నుంచి 9:30 గంటల వరకు టోకెన్లు ఇస్తారు. ప్రయాణికులు తమకు కేటాయించిన టోకెన్ నంబర్ ప్రాతిపదికన సమయానికి కౌంటర్ వద్దకు వచ్చి టికెట్ బుక్ చేసుకోవచ్చు.

Related Articles

Related image1
Weather update: తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ తో భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో ఆగస్టు 3 వరకు అలర్ట్
Related image2
Samsung Galaxy S27 Series: శాంసంగ్ గెలాక్సీ S27 సిరీస్ లో అదిరిపోయే సూపర్ ఫీచర్లు.. ఐఫోన్‌కి మైండ్ బ్లాకింగ్ కాంపిటీషన్!
35
విండోల వద్ద టోకెన్ల పరిమితి
Image Credit : Meta AI

విండోల వద్ద టోకెన్ల పరిమితి

రిజర్వేషన్ కౌంటర్లలో రద్దీని నియంత్రించేందుకు ప్రతి విండోకు టోకెన్ల సంఖ్యను నిర్ణయించారు. ఒక్కో విండో వద్ద ఏసీ తత్కాల్ కోసం 10 టోకెన్లు, నాన్ ఏసీ లేదా స్లీపర్ తత్కాల్ కోసం 15 టోకెన్లు జారీ చేస్తారు. అయితే ప్రయాణికుల రద్దీ, స్థానిక అవసరాలకు అనుగుణంగా ఈ టోకెన్ల సంఖ్యను పెంచే లేదా తగ్గించే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. టోకెన్లు ఉన్న వారందరికీ టికెట్లు ఇచ్చాక కూడా సీట్లు మిగిలి ఉంటే, మిగిలిన ప్రయాణికులకు ‘ఫస్ట్ కమ్ - ఫస్ట్ సర్వ్’ పద్ధతిలో ఇస్తారు.

45
ఎవరికి మొదటి ప్రాధాన్యం?
Image Credit : AI Generated

ఎవరికి మొదటి ప్రాధాన్యం?

ఈ కొత్త టోకెన్ ప్రాసెస్‌లో రైల్వే అధికారులు రెండు కేటగిరీలను నిర్దేశించారు. కేటగిరీ ఏ, కేటగిరీ బీ అని వీటిని విభజించారు. కేటగిరీ ఏ లో తమ కోసం లేదా తమ కుటుంబ సభ్యుల కోసం టికెట్ బుక్ చేసుకోవడానికి వచ్చే వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఈ కేటగిరీ వారు టోకెన్ తీసుకునేటప్పుడు తమ ఐడీ ప్రూఫ్‌తో పాటు ప్రయాణించే కుటుంబ సభ్యుల చెల్లుబాటు అయ్యే ఐడీ ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. మిగిలిన ప్రయాణికులందరినీ కేటగిరీ బీ లో ఉంచుతారు. కేటగిరీ ఏ ప్రయాణికులకు టోకెన్లు ఇచ్చాకే వీరికి అవకాశం లభిస్తుంది.

55
టోకెన్ ట్రాన్స్‌ఫర్ చేయడం కుదరదు
Image Credit : Gemini

టోకెన్ ట్రాన్స్‌ఫర్ చేయడం కుదరదు

రైల్వే నిబంధనల ప్రకారం ఒకరి పేరు మీద తీసుకున్న టోకెన్‌ను వేరొకరి పేరు మీదకు మార్చడం కుదరదు. టోకెన్ ఎవరి పేరిట జారీ అయితే, టికెట్ కూడా వారి పేరు మీదనే బుక్ అవుతుంది. ఈ విధానం వల్ల దళారుల బెడద తగ్గి పారదర్శకత పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఓవరాల్‌గా ఈ సిస్టమ్ వల్ల రిజర్వేషన్ కౌంటర్ల వద్ద పదే పదే తిరిగే అవసరం ఉండదు. ప్రయాణికులు ఒకేసారి వచ్చి సులభంగా తమ టికెట్ బుకింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. ఈ కొత్త రూల్స్ రైల్వే ప్రయాణికులు సూపర్ న్యూస్ అని చెప్పొచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రయాణం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Traffic Rules: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఇక అంతే సంగ‌తులు.. కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న
Recommended image2
మోదీ ప‌ర్య‌ట‌న‌వేళ తీవ్ర క‌ల‌క‌లం.. న‌కిలీ ఐడీ, తుపాకీతో ప‌ట్టుబ‌డ్డ వ్య‌క్తులు
Recommended image3
Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
Related Stories
Recommended image1
Weather update: తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ తో భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో ఆగస్టు 3 వరకు అలర్ట్
Recommended image2
Samsung Galaxy S27 Series: శాంసంగ్ గెలాక్సీ S27 సిరీస్ లో అదిరిపోయే సూపర్ ఫీచర్లు.. ఐఫోన్‌కి మైండ్ బ్లాకింగ్ కాంపిటీషన్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved