బుల్లితెర యాంకర్ గా గుర్తింపు మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ సినిమాలలో కూడా తన నటిగా తన సత్తా చాటుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీని చాలా విషయాల్లో నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు. ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్ విషయంలో అసభ్యకర కామెంట్స్ చేస్తుంటారు. అయినా అలాంటివేవీ పట్టించుకోకుండా కెరీర్ పరంగా దూసుకుపోతుంది. 

తాజాగా ఆమె నటించిన 'కథనం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఆమె ఓ టీవీ షోలో పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఆమెకి 'మీ డ్రెస్సింగ్ విషయంలో చాలా మంది మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందని..?' ప్రశ్నించగా.. దానికి ఆమె.. 'నేను ఇద్దరు పిల్లలకు తల్లి కావడం, తెలుగు అమ్మాయిని కావడం వలనే నా దుస్తుల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని' చెప్పుకొచ్చింది. 

అదే వేరే అమ్మాయి అయితే ఇలా ట్రోల్ చేసేవారా..? అసలు పట్టించుకోరని తెలిపింది. అయితే ఈ ట్రోలింగ్ లో తన పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారని.. ఆ విషయం బాధ కలిగిస్తుందని చెప్పింది. 'నీ పిల్లలకు ఏం నేర్పిస్తున్నావు..?' అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారని.. అలాంటి వారందరికీ ధీటుగా బదులిచ్చింది. 'నా పిల్లలకు నెనెఉ సమాధానం చెప్పుకుంటా.. మీకేంటి సమస్య..?' అంటూ మండిపడింది.

ఇంకా చెప్పాలంటే.. 'అర్జున్ రెడ్డి' స్టైల్ లో నా పిల్లలను పెంచుతానని చెప్పుకొచ్చింది. ఒక అమ్మాయి ఎవరైతే నీ కోసం పుట్టిందో, ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరు నీ ముందు నగ్నంగా నిలబడ్డా నువ్వు ఆ రకంగా చూడొద్దు అనే విధంగా నా పిల్లలను పెంచుతానని చెప్పుకొచ్చింది అనసూయ.