విజయవాడ: టీడీపీ విస్తృతస్థాయి సమావేశానికి  సీనియర్లు డుమ్మా కొట్టారు. కీలకసమావేశానికి సీనియర్లు డుమ్మా కొట్టడంపై సర్వత్రా చర్చ సాగుతోంది.

రానున్న రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. విజయవాడలో ఈ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి అందుబాటులో ఉండి కూడ కేశినేని నాని  హాజరుకాకపోవడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. 

టీడీపీ కృష్ణా జిల్లాలో చోటు చేసుకొన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొనే కేశినేని నాని ఈ సమావేశానికి దూరంగా ఉన్నారనే అభిప్రాయాన్ని కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు.అనంతపురం జిల్లా నుండి జేసీ సోదరులు కూడ సమావేశానికి దూరంగా ఉన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డిలు కూడ సమావేశానికి రాలేదు.

ఉరవకొండ ఎమ్మెల్యేపయ్యావుల కేశవ్ కూడ సమావేశానికి దూరంగా ఉన్నారు. పీఏసీ ఛైర్మెన్ పదవికి కేశవ్ పేరును చంద్రబాబు ప్రతిపాదించారు.  మరో వైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడ ఈ సమావేశానికి హాజరుకాలేదు.

గంటా శ్రీనివాసరావు కూడ పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది.సోషల్ మీడియాలో సాగుతున్న ఈ ప్రచారాన్ని గంటా శ్రీనివాసరావు ఖండించారు. టీడీపీలోనే కొనసాగుతానని ఆయన ప్రకటించారు. పీఏసీ ఛైర్మెన్ పదవిని గంటా శ్రీనివాసరావు ఆశించారు. చంద్రబాబునాయుడు గంటా శ్రీనివాసరావుకు ఈ పదవిని ఇవ్వలేదు.

యనమల రామకృష్ణుడు కూడ ఈ సమావేశానికి హాజరుకాలేదు. అధికార వైఎస్ఆర్‌సీపీపై యనమల రామకృష్ణుడు ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ సమావేశానికి యనమల రామకృష్ణుడు హాజరుకాకపోవడం కొంత ఆసక్తిగా మారింది.

వ్యక్తిగత కారణాలతో పాటు, ఆరోగ్య సమస్యలు, విదేశీ పర్యటనల్లో ఉండడం కారణంగా పార్టీ నేతలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారని చెబుతున్నారు. అయితే ఈ సమావేశానికి హాజరుకాని నేతలు ముందుగానే పార్టీ నాయకత్వం అనుమతి తీసుకొన్నారా లేదా అనే విషయం తేలాల్సి ఉంది.


సంబంధిత వార్తలు

పార్టీలో సమూల మార్పులకు చంద్రబాబు శ్రీకారం

ప్రజలు తిరగబడితే వైసీపీ నిలువదు: చంద్రబాబు

రాజీనామా చేస్తా: గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన ప్రకటన