రాజమండ్రి: రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు ఊరట లభించింది. నాన్‌ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంపై కోర్టు  అక్షింతలు వేసింది. స్టేషన్‌ బెయిల్ తో రాపాక విడుదలయ్యారు.

పోలీస్‌స్టేషన్‌పై దాడి కేసులో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై పోలీసులు  కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసేందుకు సోమవారం సాయంత్రం నుండి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మంగళవారం మధ్యాహ్నం రాజోలు పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ లొంగిపోయాడు ఎమ్మెల్యేను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడంపై కోర్టు పోలీసులపై అక్షింతలు వేసింది. నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడాన్ని కోర్టు తప్పుబట్టింది.

దీంతో కోర్టు స్టేషన్ బెయిల్‌పై రాపాక వరప్రసాద్ విడుదలయ్యాడు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను అరెస్ట్ చేసేందుకు భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. రాజోలు పోలీస్ స్టేషన్ లో ఐజీ మకాం వేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

గోటితో పోయేదానికి.. రాపాక అరెస్టుపై పవన్ కళ్యాణ్

పోలీసులకు లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే రాపాక

ఎమ్మెల్యే రాపాకపై పోలీస్ కేసు... స్పందించిన డీఐజీ

పోలీసులకు లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే రాపాక

జనసేనకు షాక్.. ఎమ్మెల్యే రాపాక అరెస్టుకి రంగం సిద్ధం