అమరావతి: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. 70ఏళ్ల తెలగునేల చరిత్రలో తాను జగన్ తో కలిసి కొత్త చరిత్ర సృష్టించబోతున్నట్లు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. 

గోదావరి నీటిని తెలంగాణ భూభాగంలోకి తీసుకెళ్లి అక్కడ నుంచి శ్రీశైలానికి తెస్తామనడం అన్యాయమని చంద్రబాబు విమర్శించారు. గోదావరి మిగులు జలాలను శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు అందిస్తామని స్పష్టం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్-కేసీఆర్ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. 

విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన టీడీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు గోదావరి జలాల విషయంలో జగన్, కేసీఆర్ ల వైఖరిని తప్పుబట్టారు.  గోదావరి జలాలను మన భూభాగం నుంచే తీసుకెళ్లే ప్రాజెక్టులకు ఆలోచనలు చేయాలని హితవు పలికారు. 

450 కిలోమీటర్లు నీటిని తీసుకుపోవడం సెంటిమెంట్ కు సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు అనుకుని చేసే నిర్ణయం కాదని ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని చేయాల్సిన నిర్ణయాలని తెలిపారు. స్వార్థ రాజకీయాలతో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయోద్దని హితవు పలికారు చంద్రబాబు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం : జగన్ కు అండగా ఉంటానన్న కేసీఆర్

చంద్రబాబు భేటీకి కేశినేని, గంటా సహా సీనియర్ల డుమ్మా, కారణం...?

పార్టీలో సమూల మార్పులకు చంద్రబాబు శ్రీకారం

ప్రజలు తిరగబడితే వైసీపీ నిలువదు: చంద్రబాబు

రాజీనామా చేస్తా: గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన ప్రకటన