టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితారకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నమ్రత సోషల్ మీడియా తరచూ షేర్ చేస్తూ ఉంటుంది. ఈ చిన్నారికి మహేష్ అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. తాజాగా సితార 'మహర్షి' సినిమాలో పాలపిట్ట అనే పాటకు డాన్స్ చేసింది. 

ఈ వీడియో కూడా నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన ముద్దుల కూతురు డాన్స్ చూసి మురిసిపోయిన నమ్రత.. 'నువ్ ఎంత చక్కగా ఉన్నవో.. ప్రతీరోజు నేను సంతోషంతో నవ్వడానికి నువ్ కారనమవుతున్నావు' అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది. ఈ వీడియో సితార ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ కనిపించింది.

ఆమె డాన్స్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 'మా మహేష్ బాబు కూతురు అంటే ఆ మాత్రం ఉండాలా..' అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే మరికొందరు మాత్రం 'ఫ్యూచర్ సూపర్ స్టార్.. తన ఎక్స్ ప్రెషన్స్ అధ్బుతంగా ఉన్నాయంటూ' వీడియోను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సితార తన స్నేహితురాలు, దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి ఇటీవల సొంతంగా యూట్యూబ్ లో A&S పేరుతో ఛానెల్ ని ప్రారంభించింది. ఈ ఛానెల్ ని ఇప్పటివరకు ఇరవై వేల మంది సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

❤️

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Aug 12, 2019 at 10:47am PDT