ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల మృతి... మరికొన్ని వార్తలు

By rajesh yFirst Published Aug 2, 2019, 6:02 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.
 

బ్రేకింగ్ : రాజీవ్ కనకాల తండ్రి మృతి!

రాజీవ్ కనకాల తండ్రి, ప్రముఖ నటుడు అయిన దేవదాస్ కనకాల మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. 

 

యువతిని వేధించారంటూ అరాచకం: ముగ్గురు యువకులపై పాశవిక దాడి

తమ స్నేహితులు ముగ్గురు యువకులను చితక్కొడుతుంటే మరో యువకుడు ఈ తతంగాన్ని వీడియోలో చిత్రీకరిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందారు.  తాము ఏ తప్పూ చేయలేదని, తమను కొట్టొద్దని బాధితులు వేడుకున్నారు. అయినా వినకుండా కర్రలతో చితకబాదారు. అంతే కాకుండా ఈ తతంగం మెుత్తాన్ని అమీర్ అనే యువకుడు వీడియో తీశారు. 

 

సీఎం జగన్ సంచలన నిర్ణయం: ఒకరికి కేబినెట్, ఆరుగురికి సహాయమంత్రుల హోదా

అసెంబ్లీలో ప్రభుత్వ విప్ లుగా నియమితులైన ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజాలకు సహాయ మంత్రి హోదా కల్పించారు. 
 

 

సెర్బియా పోలీసుల అదుపులో నిమ్మగడ్డ... సీబీఐ కోర్టులో మెమో దాఖలు

సెర్బియా పోలీసుల నిర్భందంతో ఆయన స్వేదేశానికి రాలేకపోతున్నారని ఈ సందర్భంగా నిమ్మగడ్డ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈ విషయంపై సీబీఐకి కూడా న్యాయవాది సమాచారం ఇచ్చారు.

 

సీఎం జగన్ పదేపదే అలా మాట్లాడటం సరికాదు: దగ్గుబాటి పురంధేశ్వరి

విభజన చట్టంలోని అంశాలను 90 శాతం కేంద్రం అమలు చేసిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం  కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మరోవైపు ఇసుక పాలసీపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోవడం వల్ల నిర్మాణ రంగం కుదేలైందన్నారు. 
 

 

కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ ఇప్పుడు మెడ ఎత్తడేం: మాజీమంత్రి శైలజానాథ్ ఫైర్

వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రప్రయోజనాలను కాపాడటంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ట్రిపుల్ తలాక్ చట్టం విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శించిందని శైలజానాథ్ విమర్శించారు
 

 

జేసీ ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం

తాడిపత్రి మండలం తలారి చెరువులో సోలార్ ప్రాజెక్టును పరిశీలించడానికి వెళ్లిన ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లడానికి కనీసం అనుమతి కూడా ఇవ్వలేదు.

 

బంగాళాఖాతంలో అల్పపీడనం: గోదావరి జిల్లాలకు భారీ వర్షసూచన

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

 

మోగిన ఎమ్మెల్సీ నగారా: జగన్‌కు తలపోటు, వైసీపీలో ఆ ముగ్గురు ఎవరు..?

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అసెంబ్లీలో సంఖ్యాబలం దృష్ట్యా ఏపీలో మూడు ఎమ్మెల్సీలు వైసీపీ ఖాతాలోకి వెళ్లడం లాంఛనమే. అయితే అభ్యర్ధులను ఎంపిక చేయడం జగన్‌కు కత్తిమీదసామేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

 

అన్న క్యాంటీన్ల మూసివేత... కారణం ఇదేనని తేల్చి చెప్పిన విజయసాయి

ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు ఈ విషయంపై అధికార పార్టీపై ప్రశ్నల వర్షం కురిపించారు. పేదల కోసం ఏర్పాటు చేసిన వాటిని ఎందుకు మూసివేశారంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో సైతనం ఈ అంశంపై మాటల యుద్ధం జరుగుతోంది.

 

ఏపీ ఉద్యోగులకు షాక్: జీతాలు ఆలస్యం.. ఆర్థికశాఖ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేదువార్త. జూలై నెల వేతనాలు చెల్లింపు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఏపీ ఆర్ధిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జూలై నెలకు సంబంధించి 4 లక్షల మంది ఉద్యోగులకు గురువారం నాటికి బ్యాంకుల్లో జమ కావాల్సిన జీతం ఇంకా పడలేదు

 

నిమ్మగడ్డకు పట్టిన గతే.... జగన్ కి కేశినేని సోషల్ పోస్ట్

జగన్‌ పేరును ప్రస్తావిస్తూ.. మీ సహచరుడు బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టాడని.. వేలాది కోట్లను తిరిగి చెల్లించిన అనంతరం శ్రీరంగ నీతులు చెప్పమనండంటూ నాని ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. యూఎస్ పర్యటనలో ఉన్న ఆయన మిన్నెసోట రాష్ట్రంలోని మేయో క్లినిక్‌లో గురువారం టెస్టులు చేయించుకున్నారు.

 

ఫ్రెండ్ అని నమ్మి వెళ్లినందుకు: నగ్న చిత్రాలు తీసి ఆన్‌లైన్‌లోకి

స్నేహం పేరుతో మాట కలిపి.. నమ్మిన అమ్మాయిని మోసం చేశాడో యువకుడు. ఆమెను బయటకు తీసుకెళ్లి కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. దానిని సేవించిన యువతి స్పృహ తప్పడంతో ఆమెను ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఆమె దుస్తులు తీసివేసి నగ్న దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. 

 

సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో డాక్టర్ల తీరుపై కేటీఆర్ ఆగ్రహం

సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో డాక్టర్ల తీరుపై మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

 

పిల్లలతో పరారైన క్యాబ్ డ్రైవర్: ఛేజ్ చేసి పట్టుకున్న పేరేంట్స్

శంషాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం కిడ్నాప్ కలకలం రేపింది.పిల్లలు ఒక క్యాబ్‌లో, తల్లిదండ్రులు మిగిలిన కుటుంబసభ్యులు మరో క్యాబ్ ఎక్కారు. అయితే పిల్లలను ఎక్కించుకున్న క్యాబ్ డ్రైవర్ పరారయ్యేందుకు ప్రయత్నించాడు. 

 

ఇస్మార్ట్ ఎఫెక్ట్.. బాగా పెంచేసిన నభా నటేష్!

పూరి జగన్నాథ్ సినిమాలలో ఉండే అగ్రిసెవ్‌నెస్‌ని పూర్తిగా అడాప్ట్ చేసుకొని తనను కొత్తగా ప్రజెంట్ చేసుకొన్న నభా ఇప్పుడు యూత్‌కి హార్ట్ త్రోబ్‌గా మారటంతో వరస ఆఫర్స్  ఆమె గుమ్మం ముందు వాలుతున్నాయి. 

 

బిగ్ బాస్ 3: సిగ్గులేదా..? అలీ, అషులపై తమన్నా కామెంట్స్!

డైమండ్‌ టాస్క్‌.. కింగ్‌లా మారడం.. ఇంట్లో అధికారం చెలాయించడం అనే ఆటలో పెద్ద రచ్చ జరిగింది. ఆడవారి వేషం వేయలేనని జాఫర్‌, వరుణ్‌ సందేశ్‌లు ఎదురుతిరగడం.. అలీ రెజా, అషూ రెడ్డిపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు.. వరుణ్‌ సందేశ్‌ ఇంటి మొదటి కెప్టెన్‌గా ఎన్నిక కావడం నేటి ఎపిసోడ్‌లో హైలెట్‌గా నిలిచాయి. 
 

 

క్యూనెట్ కేసులో మరోసారి సెలబ్రిటీలకు నోటీసులు!

క్యూనెట్ కేసులో ఏడుగురు సినిమా తారలకునోటీసులు పంపించారు. అల్లు శిరీష్, బొమన్ ఇరాని, వివేక్ ఒబెరాయ్, అనీల్ కపూర్, జాకీష్రాఫ్, పూజాహెగ్డే, షారుఖ్ ఖాన్ వంటి తారలకు  నోటీసులు జారీ చేశారు. 

 

'రాక్షసుడు' సినిమా రివ్యూ!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన నటించిన ఒకట్రెండు కమర్షియల్ సినిమాలు వర్కవుట్ అయినా హీరోగా మాత్రం తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. ఈ ఏడాది 'సీత' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆడియన్స్ ని నిరాశ పరిచాడు. అయితే ఇప్పుడు 'రాక్షసుడు' అనే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 

 

నగ్నంగా నటించేందుకు రెడీ అంటున్న రామ్ హీరోయిన్!

ప్రస్తుతం సౌత్ హీరోయిన్లు కమర్షియల్ చిత్రాలతో పాటు లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సమంత లాంటి హీరోయిన్లయితే లేడి ఓరియెంటెడ్ చిత్రాలతోనే వినోదాన్ని కూడా అందిస్తున్నారు. హీరోయిన్ బిందుమాధవి కూడా అలాంటి పాత్రలకు తాను సిద్ధం అని అంటోంది. 

 

చిరంజీవి ఆకాశం.. అక్కడికి చేరుకోవడమే నా టార్గెట్.. కార్తికేయ!

ఆర్ ఎక్స్ 100 లాంటి యువతకు నచ్చే ఎమోషనల్ లవ్ స్టోరీతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు కార్తికేయ. ఆ చిత్రంలో కార్తికేయ నటనకు బావుండడంతో అతడికి మంచి ఇమేజ్ ఏర్పడింది. నటుడిగా తన స్థాయిని, హీరోగా మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నాల్లో ఈ యువ హీరో ఉన్నాడు. కార్తికేయ నటించిన తాజా చిత్రం గుణ 369 శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 

సమంతను, అమలాను పంపిస్తావా..? నాగ్ పై బూతుల వర్షం!

టాస్క్ ల పేరుతో కంటెస్టంట్ లను మానసికంగా హింసిస్తున్నారని.. దమ్ముంటే అమలను, సమంతను బిగ్ బాస్ షోకి పంపించండి అంటూ నాగార్జునకి సవాల్ విసిరింది శ్వేతారెడ్డి.  

 

హీరో రాజశేఖర్ పై మండిపడ్డ మహిళ.. పోలీసులు ఏం చేయలేరా!

సినీ నటుడు రాజశేఖర్ పై సోషల్ మీడియాలో ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రాఫిక్ రూల్స్ విషయంలో సామాన్యుల పట్ల ఒకలా, సెలబ్రిటీల విషయంలో మరోలా పోలీసులు ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించింది. హీరో రాజశేఖర్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించినందుకుగాను రూ. 18 వేల వరకు చలానాలు పెండింగ్ లో ఉన్నట్లు ఓ ఆంగ్ల పత్రికలో వార్తలు వచ్చాయి. 

 

'బిగ్ బాస్' డబ్బు కోసం ఆడే గేమ్.. నాగార్జున కామెంట్స్ బాధించాయి!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 పై బయట చాలా చర్చ జరుగుతోంది. ప్రారంభానికి ముందే ఈ షోపై అనేక వివాదాలు నెలకొన్నాయి. కానీ హోస్ట్ గా మాత్రం నాగార్జు షోని విజయవంతంగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం రెండవ వారం ఎపిసోడ్స్ జరుగుతున్నాయి. బిగ్ బాస్ 3పై ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 

ఆదోని నుంచి చిరు ఇంటికి వెండి మండపం!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా చిత్రంతో బిజీగా ఉన్నారు. చిరుకి దైవ భక్తి కూడా ఎక్కువే. ముఖ్యంగా ఆంజనేయ స్వామి అంటే చిరు ఎక్కువ భక్తిని ప్రదర్శిస్తుంటారు. తాజాగా మెగాస్టార్ నివాసానికి కొత్త వెండి మండపం చేరింది. దీనిని చిరంజీవి పూజా కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా చేయించుకున్నారు. 

 

కాఫీ కింగ్ సిద్ధార్థ మృతి...విస్తుపోయే విషయాలు వెలుగులోకి

కేఫ్ కాఫీడే గ్రూపుకి చెందిన ఉద్యోగులు, ఉన్నతాధికారులు కొందరు బోగస్ పత్రాలు సమర్పించి తమిళనాడు కేంద్రంగా పనిచేస్తున్న ఓ ప్రైవేటు బ్యాంకులో రూ.145కోట్ల మేర అడ్డదారిలో రుణాలు పొందినట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు తాజాగా గుర్తించారు.

 

అమర్ నాథ్ యాత్రలో పాక్ కుట్ర... భగ్నం చేసిన భారత ఆర్మీ

పాకిస్థాన్ ఉగ్రవాదులు అమరనాథ్ యాత్రలో అలజడి సృష్టించాలని ప్రయత్నించారని చినార్ కార్స్ప్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ దిల్లాన్ తెలిపారు. దీనికి సంబంధించి తమకు సమాచారం అందిందని.. వెంటనే సోదాలు నిర్వహించామని వారు చెప్పారు. 

 

click me!