సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో డాక్టర్ల తీరుపై కేటీఆర్ ఆగ్రహం

First Published Aug 2, 2019, 5:10 PM IST

సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో డాక్టర్ల తీరుపై మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో డాక్టర్ల తీరుపై మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలో సమస్యలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

గురువారం ఈ ఆస్పత్రిలో  వైద్యం అందక గర్భిణి చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై  కేటీఆర్‌ స్పందించారు. వైద్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. డాక్టర్ల తీరు ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేదిగా ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన వారిని మరోచోటకి వెళ్లమని చెప్పడం దారుణమన్నారు.

ఏమీ లేనివాళ్లే ప్రభుత్వాస్పత్రికి వస్తున్నారని తెలిపారు. మరో చోటకు వెళ్లమని ఉచిత సలహాలు ఇవ్వొద్దని వైద్యులకు సూచించారు. ఇక్కడ పోస్టింగ్‌ వస్తే.. డిప్యూటేషన్‌పై మరో చోటకు వెళ్లడం సరికాదన్నారు. డాక్టర్లను తయారు చేసేందుకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.

డాక్టర్లు అందుబాటులో ఉండి స్థానికులకు సాయం చేయాలని కోరారు. త్వరలోనే సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి గైనకాలజి డాక్టర్‌ను రప్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం మిమ్మల్ని డాక్టర్లుగా తయారు చేస్తే మూడేళ్లు జిల్లాలో పనిచేయలేరా? అని ప్రశ్నించారు. గైనకాలజిస్టు లేక గర్భిణీలను వెనక్కి పంపుతున్నారనే వార్తలపై ఉన్నతాధికారులతో కేటీఆర్‌ మాట్లాడారు. వైద్యశాఖ సెక్రటరీతో ఫోన్‌లో మాట్లాడి నలుగురు గైనకాలజిస్టులను నియమించాలని కోరారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?