‘నన్ను దోచుకుందువటే’తో తెలుగు ఆడియన్స్‌ని తనవైపుకు తిప్పుకున్న అందం  నభా నటేష్.  ఆ సినిమాలో తన యాక్టింగ్ టాలెంట్‌తో ఫిదా చేసిన నభా.. ఇస్మార్ట్ శంకర్‌కి వచ్చేసరికి  గ్లామర్ తో పూర్తి కమర్షియల్ హీరోయిన్‌గా  రెచ్చిపోయింది. పూరి జగన్నాథ్ ఆమె అందాలను తెరపై ఆరబోయటంలో  రికార్డ్ క్రియేట్ చేసారు. దాంతో  ఇస్మార్ట్ శంకర్  తో  నభా డైలాగ్ మోస్ట్ పాపులర్ అయ్యింది. మాస్ రోల్‌లో కనిపించిన  నభా  రెండు రాష్ట్రాల తెలుగు కుర్రాళ్ళను ఎట్రాక్ట్ చేసింది.

పూరి జగన్నాథ్ సినిమాలలో ఉండే అగ్రిసెవ్‌నెస్‌ని పూర్తిగా అడాప్ట్ చేసుకొని తనను కొత్తగా ప్రజెంట్ చేసుకొన్న నభా ఇప్పుడు యూత్‌కి హార్ట్ త్రోబ్‌గా మారటంతో వరస ఆఫర్స్  ఆమె గుమ్మం ముందు వాలుతున్నాయి. దిమ్మాక్ కరాబ్ సాంగ్‌లో నభా ఎక్స్ ప్రెషన్స్ అండ్ డాన్స్ స్టెప్పులు అదిరిపోవటంతో హీరోలు ఆమెనే కావాలని అడుగుతున్నారు. దాంతో నభా ఒక్కసారిగా రెమ్యునేషన్ పెంచేసిందని టాక్. 

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకో అనే కాన్సెప్టు అని అప్పుడే ఫాలో అవుతున్న ఈ భామ కొత్త సినిమాలకు రూ. 25 నుంచి రూ. 40 లక్షల వరకు డిమాండ్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది.  మొదట రెండు సినిమాలకు  కేవలం ఎనిమిది నుంచి పది లక్షలు  మాత్రమే తీసుకుందిట. ప్రస్తుతం రవితేజ సరసన 'డిస్కోరాజా'లో చేస్తుంది. ఇప్పటి వరకు కన్నడ తెలుగు చిత్రాల్లోనే నటించింది.