వాంపిక్ వ్యవహారంలో ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. కాగా... ఈ కేసుకు సంబంధించి నిమ్మగడ్డ తరపు న్యాయవాది సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. సెర్బియా పోలీసుల నిర్భందంతో ఆయన స్వేదేశానికి రాలేకపోతున్నారని ఈ సందర్భంగా నిమ్మగడ్డ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈ విషయంపై సీబీఐకి కూడా న్యాయవాది సమాచారం ఇచ్చారు.

వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ ణు ఐరోపా దేశమైన సెర్బియా పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఆయన విహారయాత్రకు అని అక్కడికి వెళ్లగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది.

వాన్ పిక్ పోర్టు వ్యవహారానికి సంబంధించి యూఏఈలోని రస్ అల్ ఖైమా లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా నిమ్మగడ్డకు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. దీంతో... ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.